ETV Bharat / sports

IPLలో చాహల్ అరుదైన ఘనత- షేన్ వార్న్ రికార్డ్ బ్రేక్ - Yuzvendra Chahal IPL 2024

Yuzvendra Chahal IPL 2024: యంగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్​లో మరో ఘనత సాాధించాడు. బుధవారం గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో లెజెండ్ షేన్ వార్న్ రికార్డ్ బ్రేక్ చేశాడు.

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 4:03 PM IST

Updated : Apr 11, 2024, 4:13 PM IST

Yuzvendra Chahal Shane Warne Record
Yuzvendra Chahal Shane Warne Recordt

Yuzvendra Chahal IPL 2024: రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్​లో మరో అరుదైన ఘనత అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్​గా రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో చాహల్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ రికార్డ్ బ్రేక్ చేశాడు. 2008- 2011 మధ్య నాలుగు సీజన్​లపాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 55 మ్యాచ్​లు ఆడిన వార్న్ 7.27 ఎకనమీతో 57 వికెట్లు పడగొట్టాడు.

కాగా, చాహల్ ఈ రికార్డును బుధవారం గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్​లో 2 వికెట్లు తీసిన చాహల్ ఈ ఫీట్ అందుకున్నాడు. చాహల్ ఇప్పటివరకూ 36 మ్యాచ్​ల్లో రాజస్థాన్​కు ప్రాతినిధ్యం వహించి, 58 వికెట్లు నేలకూల్చాడు. ఇక ఓవరాల్​గా పేసర్ త్రివేది (65 వికెట్లు), షేన్ వాట్సన్ (61 వికెట్లు) రాజస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో చాహల్ కంటే ముందున్నారు. ఇక చాహల్ ప్రస్తుతం ఉన్న ఫామ్​కి ఈ సీజన్​లోనే టాప్​ ప్లేస్​కు చేరే ఛాన్స్ ఉంది.

ఐపీఎల్​లో ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు

  • లసిత్ మలింగ- ముంబయి ఇండియన్స్- 170 వికెట్లు
  • సునీల్ నరైన్- కోల్​కతా నైట్​రైడర్స్- 166 వికెట్లు
  • జస్ప్రీత్ బుమ్రా- ముంబయి ఇండియన్స్- 150 వికెట్లు
  • భువనేశ్వర్ కుమార్- సన్​రైజర్స్ హైదరాబాద్- 147 వికెట్లు

Ipl 2024 Purple Cap: ప్రస్తుత ఐపీఎల్​లో చాహల్ అదరగొడుతున్నాడు. తాజాగా గుజరాత్​తో మ్యాచ్​లో 2 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్​లో ఇప్పటివరకూ 5 మ్యాచ్​లు ఆడిన చాహల్ 10 వికెట్లతో టాప్​లో ఉన్నాడు. 9 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

చాహల్ @150: రాజస్థాన్ రాయల్స్​ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బుధవారం (ఏప్రిల్ 10)న జరిగిన మ్యాచ్​తో ఐపీఎల్​లో 150 మ్యాచ్​లు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకూ 150 మ్యాచ్​లు ఆడిన చాహల్ 7.66 ఎకనమీతో 197 వికెట్లు పడగొట్టాడు.

'ఆరెంజ్ క్యాప్​ అతడే గెలుచుకుంటాడు!' - ఐపీఎల్​పై చాహల్ ప్రిడిక్షన్​

'అప్పటికి చాహల్ ఎవరో నాకు తెలీదు- ఆ ఒక్క మాటతో నచ్చేశాడు'- ధనశ్రీ లవ్​ కహానీ!

Last Updated : Apr 11, 2024, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.