WT20 World Cup 2024 Mithali Raj Slams India Women : యూఏఈలో జరుగుతున్న 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు నిష్క్రమించిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశలోనే భారత్ జట్టు ఎలిమినేట్ కావడంపై భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా భారత మహిళల క్రికెట్లో ప్రగతి లేదని, తాజాగా టీ20 ప్రపంచకప్‌లో ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ పేర్కొంది.
ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ భారత జట్టు ప్రదర్శనను బహిరంగంగా విమర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోని సమస్యలను ఎత్తి చూపింది. జట్టులో ఎలాంటి అభివృద్ధి లేకపోవడమే నాకౌట్ దశకు చేరుకోలేకపోవడానికి కారణమని పేర్కొంది. మ్యాచ్‌కు ముందు వ్యూహ రచన, ప్రణాళికలను అమలు చేయడాన్ని ప్రశ్నించింది.
బ్యాటింగ్ ఆర్డర్‌కు ప్లాన్ ఉందా?
బ్యాటింగ్ ఆర్డర్ గురించి మిథాలీ మాట్లాడుతూ, "బ్యాటింగ్ ఆర్డర్‌లో జట్టుకు స్పష్టమైన ప్రణాళిక లేదు. టోర్నమెంట్ సమయంలో కొందరి పొజిషన్లపై గందరగోళం నెలకొంది. ప్రత్యేకించి బ్యాటింగ్ లైనప్‌లో కీలక స్థానాల్లో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ వంటి ప్లేయర్లు మారారు. ఇలాంటివి క్లిష్టమైన సమయాల్లో జట్టును నష్ట నష్టపరుస్తాయి." అని పేర్కొంది.
ఆ అవకాశం కోల్పోయారు - ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ఆసియా కప్ 2024లో సన్నద్ధమయ్యే అవకాశాన్ని భారత జట్టు ఉపయోగించుకోలేదని మిథాలీ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ, "జట్టు ప్రపంచ కప్ కోసం కనీసం 70-80% ప్రణాళికలను ఖరారు చేయడానికి ఆసియా కప్ టోర్నమెంట్‌ను ఉపయోగించాలి. బ్యాటింగ్ లైనప్‌లో కీలకమై నంబర్ 5, నంబర్ 6 వంటి స్థానాలకు ఆటగాళ్లను గుర్తించడానికి ఇది సరైన వేదిక. ముందున్న పెద్ద సవాలుకు సిద్ధం కాకుండా, ఆసియా కప్‌ను గెలవడంపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆసియా కప్ సమయంలో ప్రపంచ కప్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు అనిపించలేదు." అని తెలిపింది.
బెంచ్ ప్లేయర్లకు అవకాశాలు లేవు - ఆసియా కప్ సమయంలో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వలేదని మిథాలీ రాజ్ విమర్శించింది. బలమైన స్క్వాడ్‌ను నిర్మించడంలో జట్టు విధానాన్ని ఆమె ప్రశ్నించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, "తక్కువ ర్యాంక్ ఉన్న జట్లతో జరిగే మ్యాచ్‌లలో పురుషుల జట్టు, డెప్త్‌ను పెంచడానికి ఆటగాళ్లను క్రమం తప్పకుండా రొటేట్ చేస్తుంది. అదే విధంగా భారత మహిళల జట్టు తన బెంచ్ బలాన్ని పరీక్షించి ఉండాల్సింది." అని పేర్కొంది.
ఫిట్‌నెస్ ప్రమాణాలపై ఆందోళన - మిథాలీ రాజ్ లేవనెత్తిన మరో కీలక సమస్య జట్టు ఫిట్‌నెస్. ఫిట్‌నెస్ అనేది ఒక ప్రధాన టోర్నమెంట్‌కు ముందు పరిష్కరించదగిన విషయం కాదని, ఏడాది పొడవునా పని చేయాలని ఆమె అభిప్రాయపడింది. జట్టు ఫిట్‌నెస్ బెంచ్‌మార్క్‌లను నెలకొల్పాలని, ముఖ్యమైన టోర్నమెంట్‌ల కోసం ఆటగాళ్లు అత్యుత్తమ ఫిజికల్ కండిషన్‌లో ఉండేలా చూడాలని తెలిపింది.
36 ఏళ్లుగా ఒక్క విజయం లేదు - భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టుల్లో ఎవరిది పైచేయి?
కివీస్‌తో టెస్ట్ సిరీస్ - అరుదైన రికార్డ్‌కు చేరువలో విరాట్ కోహ్లీ