ETV Bharat / sports

రసవత్తరంగా మారిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ క్లైమాక్స్​ - 13వ గేమ్‌ డ్రా - WORLD CHESS CHAMPIONSHIP

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో డ్రాగా ముగిసిన 13వ గేమ్.

World Chess Championship
World Chess Championship (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 11, 2024, 9:19 PM IST

World Chess Championship : ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ క్లైమాక్స్​ రసవత్తరంగా మారింది. 14 గేమ్‌లు ఉండే ఈ ప్రపంచ మ్యాచ్‌లో 12 గేమ్‌లు పూర్తయ్యేసరికి భారత యువ సంచలనం గుకేశ్, డింగ్ లిరెన్‌ 6-6తో సమంగా నిలిచారు. ఇక బుధవారం జరిగిన 13వ గేమ్‌ డ్రాగా ముగిసింది.

ఈ 13వే గేమ్​లో 69 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. దీంతో ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్స్​ 6.5 - 6.5 పాయింట్లతో సమానంగా నిలిచారు. ఇక గురువారం జరిగే చివరి (14వ) గేమ్‌లో ఏ ప్లేయర్​ అయితే గెలుస్తారో, వారే ఛాంపియన్‌గా అవతరిస్తారు. ఒకవేళ ఆఖరి గేమ్‌ కూడా డ్రా ముగిస్తే, ఇద్దరు ప్లేయర్లు ఏడేసి పాయింట్లతో సమానంగా నిలుస్తారు. అప్పుడు శుక్రవారం టై బ్రేక్‌లో విజేతను నిర్ణయించాల్సి వస్తుంది.

కాగా, ఈ టోర్నీలో మొదటి గేమ్​లో లిరెన్‌ గెలవగా, రెండో గేమ్ డ్రాగా ముగిసింది. మూడో గేమ్‌లో గుకేశ్ విజయం సాధించి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఏకంగా వరుసగా ఏడు గేమ్‌లు డ్రాగా మిగిలాయి. 11వ రౌండ్లో మాత్రం గుకేశ్‌ విజయం సాధించి 6-5తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ,12వ గేమ్‌లో పెద్దగా పోటీ ఇవ్వలేక ఓటమిని అందుకున్నాడు.

స్మృతి మంధాన ఆల్‌టైమ్ రికార్డ్ - ఏడాదిలో నాలుగోది

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ - 6 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ డౌన్!, కోహ్లీ ర్యాంక్ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.