WI vs Eng T20 Wolrd Cup 2024: 2024 టీ20 వరల్డ్‌కప్ సూపర్- 8లో ఇంగ్లాండ్ ఘనంగా బోణీ కొట్టింది. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆతిథ్య విండీస్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ (87* పరుగులు), జాని బెయిర్ స్టో (48* పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్, రస్సెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన సాల్ట్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
181 పరుగుల భారీ లక్ష్య ఛేదనను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆరంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు జాన్ బట్లర్ (25 పరుగులు) భారీ షాట్లకు పోకుండా కాసేపు సాల్ట్‌కు సహకారం అందించాడు. 7.4వద్ద బట్లర్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ అలీ (13 పరుగులు) పెద్దగా ప్రభావం చూపలేదు. అతడు రస్సెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
అప్పటికి ఇంగ్లాండ్ 10.1 ఓవర్లకు 84-2తో ఉంది. ఇక అప్పుడు క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, సాల్ట్‌లో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బెయిర్ స్టో, సాల్ట్‌కు సహకారం అందిస్తూ బౌండరీల మోత మోగించాడు. అటు 16వ ఓవర్లో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రొమారియో షెపర్డ్ వేసిన ఆ ఓవర్లో సాల్ట్ 4,6,4,6,6,4తో 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో సమీకరణం 24 బంతుల్లో 10 పరుగులుగా మారింది. ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (38 పరుగులు: 34 బంతుల్లో), పావెల్ (36 పరుగులు: 17 బంతుల్లో), రూథర్‌ఫర్డ్ (28* పరుగులు: 15 బంతుల్లో) రాణించారు. అయితే విండీస్‌కు దక్కిన ఆరంభం చూస్తే, స్కోర్ 200+ దాటేలా కనిపించింది. విండీస్ 10 ఓవర్లకు 82-0తో పటిష్ఠంగా నిలిచింది. కానీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ పుంజుకుంది. కట్టుదిడ్డంగా బంతులేస్తూ విండీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆసీస్‌దే ఆల్‌రౌండర్ పొజిషన్ - ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే?
విలియమ్సన్ షాకింగ్ డెసిషన్- T20 ప్రపంచకప్ ప్రదర్శనే కారణం! - T20 World Cup 2024