Paris Olympics 2024 Athletes Village : విశ్వక్రీడలు ఒలింపిక్స్ సంబరం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల కోసం వసతి కల్పించేదే క్రీడా గ్రామం. ప్రతిసారి ఒలింపిక్స్ రాగానే దీని గురించే చర్చ సాగుతుంది.
ఎందుకంటే మారుమూల గ్రామం నుంచి వచ్చిన అథ్లెట్లు, తమ ఆరాధ్య ఆటగాడితో కలిసి ఒకే చోట ఉండే అవకాశాన్ని కల్పిస్తుందీ గ్రామం. మొదటిసారి ఒలింపిక్స్ ఆడబోయే క్రీడాకారులు, తమదైన ముద్ర వేసిన దిగ్గజాలు, పతకాల్లో రికార్డులు సాధించిన మేటి అథ్లెట్లు ఇలా అందరూ ఒకే చోట ఉండి ప్రాక్టీస్ చేస్తూ సేదతీరుతూ ఉంటారు.
మూడు నగరాల్లో విసర్తించి - ఈ పారిస్ ఒలింపిక్స్ కోసం క్రీడా గ్రామాన్ని పర్యావరణహితంగా, అథ్లెట్ల అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. కొంతమంది అథ్లెట్ల నుంచి సలహాలు, సూచనలతో మొత్తం 131 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో 82 భవనాలు ఉండగా వాటిలో 3 వేల ప్లాట్లలో 7200 రూమ్స్ ఉన్నాయి. సుమారు రూ.15,490 కోట్లతో దీనిని నిర్మించారు. సీన్ నది ఒడ్డుపై సెయింట్ డెనిస్, సెయింట్ వాన్, లీలి సెయింట్ డెనిస్ వంటి మూడు నగరాల్లో ఈ క్రీడా గ్రామం విస్తరించి ఉంది.
సదుపాయాలు - మొత్తం ఒలింపిక్స్‌లో పాల్గొనే 14,500 మందికి, పారాలింపిక్స్‌లో పాల్గొనే 9 వేల మందికి ఇది వసతి కల్పించనుంది. అథ్లెట్లు శిక్షణ చేసేలా జిమ్, సరదాగా సేద తీరేందుకు విలేజ్ క్లబ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
బ్రేక్‌డ్యాన్సింగ్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, ఫెన్సింగ్, రెజ్లింగ్ వంటి ప్రాక్టీస్ వేదికలున్నాయి. ఈ క్రీడా గ్రామంలో తొలిసారిగా నర్సరీ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన భోజనశాలలో ఒకేసారి 3500 మంది భోజనం చేసేలా సదుపాయం కల్పించారు. భారతీయ అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాలతో ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. రోజుకు 40 వేల భోజనాలు అందించనున్నారు.
మంచాలపై విమర్శలు - ఇకపోతే ఇక్కడి మంచాలు కార్డుబోర్డు (పెద్ద అట్టలు)తో చేసినవి. అయితే ఇవి ఒకరికే సరిపోయేంత చిన్నగా ఉన్నాయి. శృంగారానికి సౌకర్యవంతంగా ఉండేలా కనిపించడం లేదని చాలా మంది అంటున్నారు. కానీ అలా ఏమీ కాదని, సరిగ్గా సరిపోతుందని, ఇవి కలప, ఉక్కు మంచాల కన్నా దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. పునర్వినియోగించేందుకు వీలుగా ఈ మంచాలను, పరుపులను ఏర్పాటు చేశారట. అలానే ఈ క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం 3 లక్షల కండోమ్‌లను(paris olympics 2024 condoms) అందుబాటులో ఉంటారట.
మళ్లీ ఉపయోగించేలా - ఇక ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఈ క్రీడా గ్రామం మళ్లీ ఉపయోగించేలా నిర్మించారు. ఇందులోని 2800 ఇళ్లు, ఓ హోటల్, పార్కు, కార్యాలయాలు, దుకాణాలతో నివాస ప్రాంతంగా మారనుంది. పర్యావరణ రక్షణ కోసం అథ్లెట్ల గదుల్లో ఏసీలు కూడా బిగించలేదు. జియోథర్మల్ విధానంలో రూపొందించారు. అథ్లెట్ల ట్రాన్స్పోర్ట్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఒలింపిక్స్ వల్ల ఆతిథ్య దేశాలకు లాభమా? నష్టమా? - Paris Olympics 2024
ఒలింపిక్స్ గ్రామంలో స్పెషల్ అరేంజ్మెంట్స్ - అథ్లెట్ల కోసం 3 డ్రెస్ కిట్స్ - Paris Olympics 2024