West Indies Cricket Central Contracts : వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విండీస్ క్రికెట్ చరిత్రలో తొలిసారి 9మంది ప్లేయర్లకు రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్టును ఇచ్చింది. అందులో ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉండటం గమనార్షం. అలాగే 15మంది విండీస్ పురుషులు, మహిళలు జట్ల ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టును సైతం ఇచ్చింది.
రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్టు అందుకేనట!
విండీస్ క్రికెటర్లు షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేశ్ మోతీ, జేడెన్ సీల్స్ రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్టు పొందారు. అలాగే షెమైన్ కాంప్ బెల్లే, హేలీ మాథ్యూస్, స్టాఫనీ టేలర్ వంటి మహిళా క్రికెటర్లు కూడా విండీస్ బోర్డు నుంచి రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్టును దక్కించుకున్నారు. గతేడాది వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ వంటి క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్టును తిరస్కరించారు. అలాగే టీ20 లీగ్ వైపే వారు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో క్రికెట్ వెస్టిండీస్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా ప్లేయర్లకు రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్టును ఇచ్చింది.
గడువు ఇదే!
క్రికెట్ వెస్టిండీస్ ప్రకారం వార్షిక కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాది అక్టోబరు 1- 2025 సెప్టెంబర్ 30తో ముగియనుంది. రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ప్లేయర్లకు 2024 అక్టోబరు 1- 2026 సెప్టెంబరు వరకు గడువు ఉంటుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన కవెమ్ హాడ్జ్, రోస్టన్ చేజ్‌కు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది.
వెస్టిండీస్ రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్ల లిస్ట్
పురుషులు : షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోతీ, జేడెన్ సీల్స్.
మహిళలు : షెమైన్ కాంప్ బెల్లే, హేలీ మాథ్యూస్, స్టాఫనీ టేలర్.
వార్షిక కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్లు
పురుషులు : అలిక్ అథానాజ్, క్రైగ్ బ్రాత్ వైట్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జాషువా డా సిల్వా, కావెం హాడ్జ్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, రోవ్ మాన్ పావెల్.
మహిళలు : ఆలియా అలీన్, షామిలియా కన్నెల్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, చెర్రీ ఆన్ ఫ్రేజర్, చినెల్లే హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, అష్మిని మునిసార్, చెడియన్ నేషన్, కరిష్మా రామ్ హారక్, రషాదా విలియమ్స్.
టీ20 ప్రపంచకప్ - ఆసక్తికరంగా సమీకరణాలు - T20 Worldcup 2024
టీ20 వరల్డ్ కప్ - వెస్టిండీస్‌పై విజయం - సెమీస్‌కు దక్షిణాఫ్రికా