Virat Kohli T20 World Cup : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు (జూన్ 9) భారత్, పాకిస్థాన్ మధ్య భీకర పోరు జరగనుంది. ఎంతో కాలంగా ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్లు తీవ్ర కసరత్తులు మొదలెట్టాయి.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమ్ఇండియాకు కీలక సూచలను ఇచ్చారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఒక్క విషయంలో జాగ్రత్త పడమన్నారు. రానున్న మ్యాచ్‌లో తన దూకుడును తగ్గించుకోని ఆడాలన్నారు. ఈ సమయంలో స్ట్రైక్‌రేట్‌ను పట్టించుకోకుండా నేచురల్‌గా బ్యాటింగ్ చేయాలని కోరారు.
"ప్రతి జట్టుకి విరాట్ కోహ్లీకి ప్రమాదకరమే. అయితే ఈ సారి పాక్‌తో ఆడనున్న మ్యాచ్‌లో అతడు కాస్త దూకుడు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం విరాట్ సూపర్ ఫామ్‌లోనే ఉన్నాడు. దీంతో అతడు ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే తనను ఔట్ చేయడం అంత సులువు కాదు. కానీ ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఐదు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అక్కడ 140-150 స్ట్రైక్‌రేట్‌తో ఆడినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సారి 130 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ తన ఆటని కొనసాగించాల్సి ఉంటుంది. అనవసరమైన షాట్‌ల జోలికి అస్సలు వెళ్లొద్దు. ఐపీఎల్‌లోనూ విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడు. పవర్ ప్లేలోనూ సిక్సర్లు బాది అదరగొట్టాడు. తను ఎలాంటి షాట్సైనా ఆడగలడు. కానీ ఈ సారి మాత్రం స్ట్రైక్‌రేట్‌ను కొంచెం తగ్గించుకుని ఆడితే బాగుంటుందని నా అభిప్రాయం. 130 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తేనే జట్టుకు మేలు జరుగుతోంది. ఎందుకంటే 15-20 ఓవర్ల మధ్య విరాట్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. డెత్ ఓవర్లలోనూ అతడు 60-70 పరుగులు స్కోర్ చేయగలడు. అది జట్టుకి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. అంతే కాకుండా కోహ్లీ ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో వస్తే బాగుంటుంది. అమెరికాలో డ్రాప్ ఇన్ పిచ్‌లపై ఆడాల్సి ఉండటం వల్ల కోహ్లీని మూడో స్థానంలో ఆడించడమే ఉత్తమం. ఫస్ట్ డౌన్‌లో కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మిడిల్ ఓవర్స్‌లోనూ కోహ్లీ సమర్థవంతంగా ఆడగలడు." అంటూ కైఫ్ అభిప్రాయపడ్డారు.
భారత్ x పాక్: టీ20 వరల్డ్‌కప్‌లో దాయాదుల చరిత్ర- 2007 నుంచి ఎలా సాగిందంటే? - T20 World Cup 2024
'ట్యాలెంట్‌కు కొదవలేదు - అలా చేస్తే టీమ్ఇండియాకు తిరుగులేదు' - T20 World Cup 2024