ETV Bharat / sports

విరాట్ @ 27000 రన్స్​ - సచిన్ రికార్డు బ్రేక్ - Virat Kohli 27000 Runs - VIRAT KOHLI 27000 RUNS

Virat Kohli 27000 Runs : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్​లో మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు.

Virat Kohli 27000 Runs
Virat Kohli 27000 Runs (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 30, 2024, 4:13 PM IST

Virat Kohli 27000 Runs : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్​లో మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ 27 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఈ ఘతన సాధించిన నాలుగో బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు. అయితే అత్యంత వేగవంతంగా ఈ మైలురాయి అందుకుంది మాత్రం విరాట్ కోహ్లీనే. విరాట్ 594 ఇన్నింగ్స్​ల్లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో దిగ్గజం సచిన్ తెందూల్కర్ (623 ఇన్నింగ్స్​) రికార్డును బ్రేక్ చేశాడు. ఇక భారత్​ నుంచి సచిన్ తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్​ విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్​లో విరాట్ 47 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

క్రికెటర్ జట్టుఇన్నింగ్స్​పరుగులు
సచిన్ తెందూల్కర్ భారత్ 78234357
కుమార సంగక్కర శ్రీలంక66628017
రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా 66827483
విరాట్ కోహ్లీ భారత్ 59427012

కాగా, విరాట్ అంతర్జాతీయ కెరీర్​లో టెస్టుల్లో 8918, వన్డేల్లో 13906,టీ20ల్లో 4188 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 80 సెంచరీలు నమోదు చేశాడు. అందులో టెస్టు (29), వన్డే (50), టీ20 (1) చేశాడు.

ఆ రికార్డుకూ చేరువలో
కాగా, టెస్టుల్లో విరాట్ 9 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు 82 రన్స్ కావాలి. ఈ ఫీట్ అందుకోవడం కూడా లాంఛనమే. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్​లో 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న నాలుగో భారత బ్యాటర్​గానూ ఘనత సాధిస్తాడు. విరాట్ కంటే ముందు టీమ్ఇండియా నుంచి సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే 9 వేల పరుగులు పూర్తి చేశారు.

అయితే 21వ శతాబ్దంలో టెస్టుల్లో అరంగేట్రం చేసి ఈ ఫీట్ అందుకోనున్న తొలి బ్యాటర్​గానూ విరాట్ నిలవనున్నాడు. 2010 తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏ భారత బ్యాటర్ కూడా 9 వేల పరుగులు చేయలేదు. ఇక బంగ్లాతో జరగనున్న తొలి ఇన్నింగ్స్​లోనే విరాట్ ఈ ఫీట్ సాధిస్తే, వేగంగా ఈ మైలురాయి అందుకున్న సునీల్ గావస్కర్ సరసన చేరే ఛాన్స్ ఉంటుంది. గావస్కర్ 192 ఇన్నింగ్స్​ల్లో 9 వేల పరుగులు చేశాడు.

సచిన్ రికార్డుపై విరాట్ కన్ను- బంగ్లా సిరీస్​లో బ్రేక్ అవ్వడం పక్కా! - Virat Kohli Records

అరుదైన ఫీట్​కు అతి దగ్గరలో బుమ్రా, కుల్దీప్ - బంగ్లా సిరీస్​లోనే అందుకోవడం పక్కా! - Ind vs Ban Test Series 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.