ETV Bharat / sports

సచిన్ రికార్డుపై విరాట్ కన్ను- బంగ్లా సిరీస్​లో బ్రేక్ అవ్వడం పక్కా! - Virat Kohli Records

author img

By ETV Bharat Sports Team

Published : Sep 12, 2024, 10:29 AM IST

Virat Kohli International Records: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెప్టెంబర్​లో ప్రారంభం కానున్న బంగ్లా టెస్టు సిరీస్​లో పలు రికార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే సచిన్ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.

Virat Kohli
Virat Kohli (Source: Getty Images)

Virat Kohli International Records: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ సిరీస్​తో దాదాపు 9 నెలల విరామం తర్వాత టెస్టుల్లో బరిలో దిగనున్నాడు. అయితే ఈ సిరీస్​లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డుపై విరాట్ కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి అది ఏంటంటే?

35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్​ల్లో 26942 పరుగులు చేశాడు. 27 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు విరాట్ మరో 58 రన్స్​ దూరంలో ఉన్నాడు. ఈ క్రమంలో రానున్న బంగ్లా టెస్టు సిరీస్​లో విరాట్ ఫీట్ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్​లో అత్యంత వేగంగా 27వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్​గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ (623 ఇన్నింగ్స్​) పేరిట ఉంది. అయితే విరాట్ ఈ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక గతంలోనూ 16,000, 17,000, 18,000, 19,000, 20,000, 21,000, 22,000, 23,000, 24,000, 25,000, 26,000 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా ఉందుకున్న రికార్డు సైతం విరాట్ పేరిటే ఉంది.

నాలుగో ప్లేయర్​గా రికార్డు
విరాట్ ఈ ఫీట్ అందుకుంటే, ఇంటర్నేషనల్ క్రికెట్​లో 27 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్​గా నిలుస్తాడు. ఈ లిస్ట్​లో సచిన్ తెందూల్కర్ (34357) టాప్​లో ఉండగా కుమార సంగక్కర, రికీ పాంటింగ్​ వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.

సచిన్ తెందూల్కర్భారత్78234357
కుమర సంగక్కరశ్రీలంక66628017
రికీ పాంటింగ్ఆస్ట్రేలియా66827483
విరాట్ కోహ్లీభారత్591 26942

ఆ రికార్డుకూ చేరువలో
కాగా, టెస్టుల్లో విరాట్ 9 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు 152 రన్స్ కావాలి. ఈ ఫీట్ అందుకోవడం కూడా లాంఛనమే. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్​లో 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న నాలుగో భారత బ్యాటర్​గానూ ఘనత సాధిస్తాడు. విరాట్ కంటే ముందు టీమ్ఇండియా నుంచి సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే 9 వేల పరుగులు పూర్తి చేశారు.

అయితే 21వ శతాబ్దంలో టెస్టుల్లో అరంగేట్రం చేసి ఈ ఫీట్ అందుకోనున్న తొలి బ్యాటర్​గానూ విరాట్ నిలవనున్నాడు. 2010 తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏ భారత బ్యాటర్ కూడా 9 వేల పరుగులు చేయలేదు. ఇక బంగ్లాతో జరగనున్న తొలి ఇన్నింగ్స్​లోనే విరాట్ ఈ ఫీట్ సాధిస్తే, వేగంగా ఈ మైలురాయి అందుకున్న సునీల్ గావస్కర్ సరసన చేరే ఛాన్స్ ఉంటుంది. గావస్కర్ 192 ఇన్నింగ్స్​ల్లో 9 వేల పరుగులు చేశాడు. అయితే విరాట్ ఇప్పటికే 191 ఇన్నింగ్స్​ల్లో 8848 పరుగులు చేశాడు.

గంగూలీ ఆల్​టైమ్ 11- టీమ్​లో విరాట్​కు నో ప్లేస్- కారణం ఇదే! - Ganguly All Time XI

ఇండియా క్రికెట్ 'కుబేరుడు' ఇతడే - సచిన్, విరాట్ కాదు! - Indias Richest Cricketer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.