Virat Kohli England Series : ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే విరాట్ అలా మ్యాచ్‌కు ఎందుకు దూరమయ్యాడన్న విషయంపై సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ క్లారిటీ ఇచ్చాడు. విరుష్క దంపతులు రెండో సారి తల్లిదండ్రులు కానున్నారంటూ ఏబీడీ క్లారిటీ ఇచ్చాడు. తన ఫాలోవర్లతో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో దీని గురించి మాట్లాడాడు. అనుష్క ప్రెగ్నెంట్‌గా ఉన్నందు వల్ల కోహ్లీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని వెల్లడించాడు.
-
Ab de villiers just confirmed that Virat Kohli's 2nd child in on the way ❤️😭 pic.twitter.com/o2BHhhqTuL
— ` (@chixxsays) February 3, 2024
మరోవైపు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి రెండు టెస్టుల నుంచి విరాట్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడు. ఇదే కారణం వల్ల గత నెలలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20కి కూడా దూరమయ్యాడు. అయితే కోహ్లీ ఇలా తరచూ క్రికెట్‌కు ఎందుకు బ్రేక్ ఇస్తున్నాడన్న విషయం గురించి నెట్టింట తీవ్ర చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో విరుష్క జంట మరోసారి తల్లిదండ్రులు కానున్నారన్న రూమర్స్ కూడా బయటకి వచ్చాయి. అయితే ఈ విషయంపై అటు విరాట్ కానీ ఇటు అనుష్క కానీ క్లారిటీ ఇవ్వలేదు. అనుష్క తన బేబీ బంప్‌తో కనిపించినప్పిటికీ అందరూ స్టార్ కపుల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేశారు. అయితే ఇప్పుడు డివిలియర్స్ ఈ విషయాన్ని రివీల్ చేయడం వల్ల విరుష్క జంట కూడా త్వరలో ఈ స్వీట్ న్యూస్‌ను తెలియజేస్తాంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Virat Anushka Marriage : ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌తో పరిచయమైన విరాట్, అనుష్క ఆ తర్వాత స్నేహితులయ్యారు. కొన్నేళ్లకు ఆ స్నేహబంధం కాస్త ప్రేమగా మారింది. అలా 5-6 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 డిసెంబరులో ఏడడుగల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టూస్కానీలో 800 ఏళ్ల నాటి వారసత్వ విల్లా వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక 2021లో ఈ జంట వామికా అనే చిన్నారికి తల్లిదండ్రులయ్యారు.
ఆరో ఏడాదిలోకి 'విరుష్క' పెళ్లి బంధం- అనుష్కను కోహ్లీ ఎలా ఇంప్రెస్ చేశాడో తెలుసా?
'రెండు పెగ్గులేస్తే అనుష్క కంటే బాగా డ్యాన్స్ చేస్తా'.. ర్యాపిడ్ ఫైర్‌లో కోహ్లీ ఆన్సర్!