VIRAT KOHLI DIET PLAN : టీమ్ ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉండే ఆటగాళ్లలో ఒకడు. అతడి ఫిట్ నెస్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. భారత క్రికెట్లో ఫిట్ నెస్ రివల్యూషన్ తీసుకొచ్చింది కోహ్లీనే అంటే అతిశయోక్తి కాదు. మైదానంలో ఎలాంటి అలసట లేకుండా జింకలా పరుగులు తీస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఓసారి కోహ్లీ డైట్ ప్లాన్, వ్యాయామం గురించి తెలుసుకుందాం.
అప్పుడే దాన్ని మానేశాడు(Virat Kohl Non Veg) - ఒకప్పుడు మాంసాహారం ఎక్కువగా తినే కోహ్లీ, 6 ఏళ్ల క్రితం హఠాత్తుగా నాన్ వెజ్ మానేశాడు. ఆ తర్వాత పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డాడు. విరాట్ వెన్నెముకలోని సర్వైకల్ డిస్క్ వాచిపోయింది. దీంతో కోహ్లీకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. మెడికల్ రిపోర్టులో కోహ్లీకి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాల్షియం లోపం ఏర్పడిందని తేలింది.
కోహ్లీ డైట్ ఛేంజ్! - కాల్షియం లోపం వల్ల కోహ్లీ ఎముకలు బలహీనంగా ఉన్నాయని వైద్య పరీక్షల్లో తెలిసింది. మాంసాహారాన్ని తినడం మానేయాలని, డైట్‌ను మార్చుకోవాలని విరాట్‌కు వైద్యులు సూచించారు. అప్పటి నుంచి అతడు పూర్తిగా మాంసాహారం మానేసి, శాకాహారిగా మారిపోయాడు. శాకాహారిగా మారినప్పటి నుంచి తన ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చాయని రన్ మెషీన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క సంఘటన వల్లే తాను డైట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని పేర్కొన్నాడు.
రోజుకు 2 గంటల వర్క్ ఔట్ - విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కోసం రోజుకు 2 గంటలు వ్యాయామం చేస్తాడు. వారంలో ఒకరోజు మాత్రమే వ్యాయామం చేయకుండా విరామం తీసుకుంటాడు. వ్యాయామంతో పాటు స్విమ్మింగ్ కూడా చేస్తుంటాడు కింగ్ కోహ్లీ. ప్రతిరోజు తన దినచర్యను ఆసక్తికరంగా ఉంచుకోవడానికి కొత్త స్కిల్స్, టెక్నిక్స్‌ను నేర్చుకుంటాడు.
కెరీర్ పరంగా - 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కింగ్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 27 వేలకు పైగా పరుగులు చేశాడు. అందులో 114 టెస్టుల్లో 8871 పరుగుల సాధించాడు. అందులో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 295 వన్డేల్లో 13,906 పరుగులు సాధించాడు. అందులో 50 శతకాలు, 72 అర్ధ శతకాలు ఉన్నాయి. 125 టీ20ల్లో 4,188 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20లకు కింగ్ కోహ్లీ ఇటీవలే గుడ్ బై చెప్పాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.
వరుస పరాజయాల వేళ టీమ్ ఇండియా కీలక నిర్ణయం - జట్టులోకి యంగ్ స్టార్ పేసర్