Virat Kohli Career Predictions: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునేందుకు వారి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తమ అభిమాన హీరో లేదా క్రికెటర్ తమతమ రంగాల్లో భవిష్యత్‌లో ఎలా రాణిస్తారాని తెలుసుకునే కుతూహలం చాలా మందికి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే జ్యోతిష్కులు కూడా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీల జ్యోతిష్యాలను బయటపెడుతూ ఉంటారు. అలా ప్రస్తుతం టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జాతకాన్ని ఓ ఆస్ట్రాలజర్ బయట పెట్టారు. 2016లోనే 2028దాకా విరాట్ కెరీర్, వ్యక్తిగత విషయాలను అంచనా వేశారు. ఆ అంచనాల ప్రకారం 2016 నుంచి ఇప్పటివరకు దాదాపు ఆయన చెప్పినట్లే జరిగాయి. అవేంటో చూద్దాం.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులు ప్రస్తుతం సంతోషంలో ఉన్నారు. ఫిబ్రవరి 15న విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులైయ్యారు. వీరికి ఆకాయ్ అనే బాబు జన్మించాడు. అయితే మామూలుగానే ఫిబ్రవరి 15 విరాట్‌కు అచ్చొచ్చిన తేదీ. 2015 వరల్డ్‌కప్‌లో విరాట్ పాకిస్థాన్‌పై 100 పరుగులు చేసిన తొలి టీమ్ఇండియా బ్యాటర్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్ జరిగింది ఫిబ్రవరి 15 నాడే.
ఇక 2017 మార్చి- ఏప్రిల్‌లో విరాట్ వివాహం జరుగుందని అంచనా వేశారు. ఆయన చెప్పినట్లే కొంచెం అటు ఇటుగా అదే ఏడాది డిసెంబర్లో విరాట్- అనుష్క పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తర్వాత ఫిబ్రవరి 2018- 2020 సెప్టెంబర్ మధ్యలో విరాట్ ఆదాయం పెరుగుతుందని, విరుష్క జంట తల్లిదండ్రులు అవుతారని అంచనా వేశారు. చెప్పినట్లే ఈ మధ్య కాలంలో అతడి నెట్‌వర్త్, ఎండార్స్మెంట్స్ పెరిగాయి. ఇక 2021 జనవరిలో పేరెంట్స్‌గా ప్రమోషన్స్ కొట్టేశారు. వీరికి వామిక జన్మించింది.
2020-21లో విరాట్ కెరీర్ పరంగా కాస్త నెమ్మదిస్తాడని చెప్పారు. అన్నట్లే 2019- 2022 మధ్య విరాట్ మ్యాచ్‌ల్లో పరుగులు సాధించడానికి చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడు క్యాలెండర్ సంవత్సరాల పాటు అంతర్జాతీయ సెంచరీ చేయలేదు. విరాట్ మళ్లీ 2021-25లో పుంజుకుంటాడని అంచనా వేశారు. అంచనా ప్రకారం విరాట్ 2021 తర్వాత టీ20 వరల్డ్‌కప్ సహా ఆయా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాత ఫామ్ అందుకున్నాడు. 2023 వరల్డ్‌కప్‌లో ఏకంగా వన్డేల్లో అత్యధిక (50) సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఫామ్ 2025దాకా ఇలాగే కొనసాగుతుందని ఆస్ట్రాలజర్ అంచనా.
అలాగే, 2021- 2024 మధ్య మరొక బిడ్డ పుట్టవచ్చని ముందే చెప్పారు. చెప్పినట్లుగానే 2024 ఫిబ్రవరి 15న ఈ దంపతులకు అకాయ్ జన్మించాడు. రాశి చక్రం ప్రకారం కోహ్లి 2025- 2027 మధ్య విరాట్ కెరీర్లో ఇబ్బంది పడతాడని చెబుతున్నారు. మళ్లీ 2027లో విరాట్ పుంజుకొని, 2018లో రిటైర్మెంట్ పలికే వీలుందని ఆస్ట్రాలజర్ అన్నారు. ఇక ఈ ఏడాది విరాట్‌కి 36 ఏళ్లు నిండాయి , అభిమానులు అతనిని మరో 4 సంవత్సరాలు చూడాలని ఆశిస్తున్నారు.
అప్పుడే జూనియర్ కోహ్లీ 'అకాయ్' రికార్డ్ - పాకిస్థాన్‌లో ఫ్యాన్స్ సంబరాలు!
కోహ్లీ జంట ఎక్కడ ఉందో తెలుసా? జూనియర్ విరాట్ కోసం అంత దూరం వెళ్లారా!