Virat Kohli Captaincy : భారత జట్టు సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అయిన తర్వాత అతడి బిహేవియర్లో మార్పులొచ్చాయంటా పేర్కొన్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే కోహ్లీ మధ్య ఎంతో తేడా ఉందని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ ఈ విషయాలను వెల్లడించారు.
"నేను అబద్ధం చెప్పను. ఓ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీని నేను ఎంతగానో గౌరవిస్తాను. అయితే కెప్టెన్ అయ్యాక కోహ్లీ చాలా మారిపోయాడు. అందుకే అతడికి జట్టులో తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. నేను కోహ్లీతో గతంలో ఉన్నట్లుగా ఉండటం లేదు. దాదాపుగా మాట్లాడటం కూడా మానేశాను. మనకు పేరు ప్రఖ్యాతులు, డబ్బు వచ్చింది కదా ఎవరైనా ఏదో ప్రయోజనం గురించి ఆశించి మనవద్దకు వస్తారు అని కొందరు భావిస్తారు. కానీ, నేను అటువంటి వ్యక్తిని కాదు. అయితే రోహిత్ శర్మ, కోహ్లీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరి స్వభావాలు వేరు. నేను టీమ్ఇండియాను వీడి చాలా కాలం అయ్యింది. అయినప్పటికీ కెరీర్ మొదట్లో రోహిత్ నాతో ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలానే ఉంటాడు. ఏదైనా ఈవెంట్ లేదా ఐపీఎల్ సందర్భంగా కలిస్తే ఎంతో సరదాగా మాట్లాడుతాడు. భారత జట్టు కెప్టెన్ అయినా కూడా నాతో స్నేహంగా కలిసిపోయి జోక్‌లు వేస్తుంటాడు. ప్రపంచంలోనే నంబర్ కెప్టెన్, ప్రపంచ కప్ విజేత అతడు. ఐదు ఐపీఎల్ టైటిల్స్ కూడా సాధించాడు" అంటూ రోహిత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
అయితే ఈ మాటలపై విరాట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆయన పరోక్షంగా ఏదో విషయం వల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.
ఇక అమిత్ మిశ్రా కెరీర్ విషయాని వస్తే, భారత్ తరఫున 22 టెస్ట్‌లు, 33 వన్డేలు, 10 టీ20లు ఆడారు. విరాట్ కెప్టెన్సీలో 9 టెస్ట్‌లు, 7 వన్డేలు, 2 టీ20లు ఆడిన ఈ స్టార్ క్రికెటర్ అతడి సారథ్యంలోనే చివరిసారిగా టీమ్ఇండియాకు ఆడాడు.
క్రికెట్లో 'విరాటే' కింగ్, మరి ధోనీ?- రైనా ఇంట్రెస్టింగ్ ఆన్సర్! - Suresh Raina MS Dhoni