Virat Kohli 2024 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టీమ్ఇండియా సెలక్టర్లు పక్కన పెట్టనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వరల్డ్‌కప్ వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్త వేదికలుగా జరగనున్న నేపథ్యంలో అక్కడి స్లో పిచ్‌లపై విరాట్ బ్యాటింగ్ సరిపోదని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమచారి శ్రీకాంత్ స్పందించాడు. ఇంతకీ శ్రీకాంత్ ఏమన్నాడంటే?
మెగా టోర్నీకి విరాట్ పరిగణలో ఉండడని వచ్చిన వార్తలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయన్నాడు. విరాట్ లేకుండా టీమ్ఇండియా టీ20 టోర్నీలో పాల్గొనడం అసాధ్యం అని, అవన్నీ కేవలం పుకార్లేనని శ్రీకాంత్ అన్నాడు. 'టీ20 వరల్డ్‌కప్ అయినా, వన్డే ప్రపంచకప్ అయినా టీమ్ఇండియాలో విరాట్ ఉండాల్సిందే. జట్టులో అతడిది కీలక పాత్ర. విరాట్ లేకుండా టీమ్ఇండియా రాణించడం కష్టం. 100 శాతం జట్టులో విరాట్ ఉండాల్సిందే. 2011 వరల్డ్‌కప్‌లో సచిన్ తెందూల్కర్‌కు దక్కిన గౌరవం ఇప్పుడు విరాట్‌కు కూడా దక్కాల్సిందేనని నమ్ముతున్నా. విరాట్ కోసం టీమ్ఇండియా ప్రపంచకప్ నెగ్గాలి. తన కెరీర్లో అది అతి పెద్ద విషయం' అని శ్రీకాంత్ ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడారు.
ఇక 2022 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ అదరగొట్టాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. కానీ, ఆ తర్వాత టీమ్ఇండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మేనేజ్మెంట్ టీ20 ఫార్మాట్‌కు విశ్రాంతినిచ్చింది. దాదాపు 14 నెలల తర్వాత ఈ ఇద్దరూ 2024 జనవరిలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చారు. అయితే రానున్న పొట్టికప్నకు విరాట్‌ను పరిగణలోకి తీసుకోవట్లేదని అటు బీసీసీఐగాని, బోర్డు సెక్రటరీ జై షా గాని ఎక్కడా చెప్పలేదు.
కాగా, రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విరాట్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలో దిగనున్నాడు. మార్చి 22న చెన్నైతో జరిగే మ్యాచ్‌లో విరాట్ ఆడే ఛాన్స్ ఉంది. గతేడాది మాదిరి ఈసారి కూడా ఐపీఎల్లో విరాట్ పరుగుల వరద పారించాలని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
కెప్టెన్సీ లేని రోహిత్ మరింత ప్రమాదకరం!- విరాట్‌లా గర్జిస్తాడా?
స్మృతి, విరాట్ జెర్సీ నెంబరే కాదు - ఆ విషయంలో ఇద్దరిదీ సేమ్ రూట్!