Virat Kohli Child Fan : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న అథ్లెట్. విరాట్ మ్యాచ్ ఆడుతున్నాడంటే చాలు స్టేడియంలో, టీవీల్లో ఫ్యాన్స్ అతడి బ్యాటింగ్ చూడడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తాజాగా విరాట్‌ని చూడటానికి ఓ 15ఏళ్ల బాలుడు పెద్ద సాహసమే చేశాడు. తన అభిమాన క్రికెటర్‌ని చూసేందుకు సైకిల్‌పై 58 కిలో మీటర్లు ప్రయాణించాడు. కాన్పూర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు చూసేందకు ఉన్నావ్ (Unnao) నుంచి వచ్చాడు. ప్రస్తుతం ఈ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆ బాలుడి పేరు కార్తికేయ. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. అయితే తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీని చూసేందుకు తన గ్రామం ఉన్నావ్ నుంచి సైకిల్ తొక్కుకుంటూ కార్తికేయ కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్ పార్క్‌నకు వచ్చాడు. తెల్లవారుజామున 4:00 గంటలకు తన ప్రయాణం ప్రారంభించి, ఉదయం 11:00 గంటలకు స్టేడియానికి చేరుకున్నట్లు వీడియోలో చెప్పాడు. ఇక తాను ఒక్కడినే వెళ్లడానికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నట్లు కార్తికేయ తెలిపాడు.
A 15-year-old kid rode 58 kilometers on his bicycle just to watch Virat Kohli bat pic.twitter.com/rigqQBoCHq
— A (@_shortarmjab_) September 27, 2024
బాలుడికి నిరాశే!
కాన్పూర్‌లో శుక్రవారం వాతావరణం ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో టాస్ నెగ్గిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకొన్నాడు. ఇక విరాట్ బ్యాటింగ్ చూడాలనే కార్తికేయ కోరిక ఈ రోజు నెరవేరలేదు. కాగా, చెన్నైలో ఆడిన జట్టుతోనే భారత్ బరిలో దిగింది.
తొలి రోజు ఆటకు వర్షం బ్రేక్!
తొలి రోజు 35 ఓవర్లకే ఆట ముగిసింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడం వల్ల మిగిలిన ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట రద్దయ్యే సమయానికి బంగ్లా 107/3 (35 ఓవర్లు) స్కోర్‌తో ఉంది. క్రీజులో మొమినుల్ హక్ (40 పరుగులు), ముష్పికర్ రహీమ్ (6 పరుగులు) ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.
రెండో టెస్టుకు వర్షం బ్రేక్ - 35 ఓవర్లకే ఫస్ట్ డే గేమ్ ఓవర్ - Ind vs Ban 2nd Test
కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్ - తొలి భారత బౌలర్‌గా ఘనత - Ashwin Records