ETV Bharat / sports

U 19 ఫైనల్స్​లో 'యువ భారత్' ట్రాక్ రికార్డ్​ - Ind vs aus U19 final 2024

Under 19 World Cup India Records: 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు అండర్- 19 వరల్డ్​కప్ ఫైనల్ చేరింది. మరి తుదిపోరులో యువ భారత్ ట్రాక్ రికార్డ్​పై ఓ లుక్కేద్దామా?

U 19 FINAL
U 19 FINAL
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 7:06 AM IST

Under 19 World Cup India Records: యువ టీమ్ఇండియా 2024 అండర్‌- 19 వరల్డ్​కప్​ ఫైనల్ ఫైట్​కు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో ఆదివారం (ఫిబ్రవరి 11) జరగనున్న ఫైనల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించి ఆరోసారి ఛాంపియన్​గా నిలవాలని కుర్రాళ్లతో కూడిన భారత్ ఉవ్విళ్లూరుతోంది. మరి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ఫైనల్​ చేరిన టీమ్ఇండియా ట్రాక్ రికార్డ్​పై ఓ లుక్కేద్దామా?

  1. 2000 సంవత్సరంలో టీమ్ఇండియా తొలిసారి అండర్‌- 19 ఫైనల్​కు చేరింది. మ‌హ్మ‌ద్ కైఫ్ నాయ‌క‌త్వంలో ఫైనల్​ చేరిన మొదటిసారే భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఈ ఫైనల్​లో టీమ్ఇండియా ఆల్​రౌండ్ ప్రదర్శనతో మెరిసి ఛాంపియన్​గా నిలిచింది.
  2. 2006లో టీమ్ఇండియా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ టోర్నీలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్ పుజారా జట్టులో సభ్యులు . పాకిస్థాన్​తో జరిగిన ఈ ఫైనల్​లో టీమ్ఇండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 71 పరుగులకే ఆలౌటైంది.
  3. 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ఇండియా ఫైనల్స్​కు దూసుకెళ్లింది. మలేసియాలో జరిగిన ఈ టోర్నీలో తుదిపోరులో సౌతాఫ్రికాతో తలపడిన భారత్ డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 159 పరుగులు చేయగా, అనంతరం ప్రత్యర్థిని 103కే పరిమితం చేలి కప్పు గెలిచింది.
  4. 2012 సంవత్సరం అండర్‌- 19 ఫైనల్​లో​ భారత్, ఆస్ట్రేలియాను ఢీకొట్టింది. ఈ మ్యాచ్​లో ఆసీస్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 47.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అప్పటి కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 111 సెంచరీతో భారత్ విజయంలో కీలకంగా మారాడు.
  5. 2016 ఎడిషన్ టోర్నీ రిషభ్​ పంత్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్​లాంటి యంగ్ స్టార్లను టీమ్ఇండియాకు ఇచ్చింది. అయితే ఈ ఎడిషన్​లో వెస్టిండీస్‌తో ఫైనల్​లో తలపడ్డ భారత్ ఓడింది.
  6. 2018లో పృథ్వీ షా నేతృత్వంలో టీమ్ఇండియా ఫైనల్​కు చేరింది. ఆసీస్​తో జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ 217 పరుగుల లక్ష్యాన్ని కేవలం 38.5 ఓవర్లలోనే ఛేదించి నాలుగోసారి ఛాంపియన్​గా నిలిచింది.
  7. 2020ఎడిషన్​ టోర్నీలో బంగ్లాదేశ్​తో జరిగిన ఫైనల్​లో భారత్ ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 177 స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 42 ఓవర్లలో అందుకుంది. తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ ఈ టోర్నీలో భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
  8. చివరిసారి 2022లో జరిగిన అండర్​- 19 వరల్డ్​కప్​లో టీమ్ఇండియా ఐదోసారి ఛాంపియన్​గా నిలిచింది. ఈ టోర్నీ ఫైనల్​లో ఇంగ్లాండ్​తో తలపడ్డ టీమ్ఇండియా 189 పరుగుల టార్గెట్​ను 47.4 ఓవర్లలో అందుకొని టైటిల్​ నెగ్గింది.

మరోసారి కప్​పై కన్ను- భారత్‌ Vs ఆసీస్‌- పై చేయి ఎవరిదో ?

U-19 వ‌ర‌ల్డ్​ క‌ప్​- భారత్​ ఖాతాలో ఐదు టైటిళ్లు- టీమ్​ఇండియా సక్సెస్​ఫుల్ జర్నీ మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.