ETV Bharat / sports

ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్! అంత టైమ్ ఎక్కడుందబ్బా? - Two IPL Seasons in A Year

Two IPL Seasons in A Year : ఐపీఎల్​కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పేందుకు రెడీ అవుతోంది బీసీసీఐ.

Two IPL Seasons in A Year
Two IPL Seasons in A Year
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 4:31 PM IST

Two IPL Seasons in A Year : ఐపీఎల్ అంటే ఒక బంగారు బాతు లాంటిది! క్రికెటర్ల ప్రతిభను గుర్తించడం, ఆదాయాన్ని పెంచుకోవడంలో ఐపీఎల్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. టెస్టులు, వన్డేలు, టీ20లతో సాగుతున్న క్రికెట్​లోకి ఐపీఎల్ సునామీలా వచ్చింది. వేల కోట్లు రెవెన్యూ జెనరేట్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐపీఎల్ ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఐపీఎల్ కోసం ఎదురుచూస్తుంటారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు టీవీలకు అతుక్కుపోతారు.

ఐపీఎల్​కు జనాల్లో ఆదరణ పెరిగిపోతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బీసీసీఐ ఏడాదికి ఒక ఐపీఎల్​ సీజన్​ను మాత్రమే నిర్వహించేది. త్వరలోనే ఏడాదికి రెండు ఐపీఎల్​ సీజన్లను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కోసం మొదటి రెండింటిలో ఐపీఎల్​ల్లో 74 మ్యాచ్​లను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధమాల్​ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రెండింటిలో క్రమంగా 84కు ఆ తర్వాత 94కు మ్యాచుల సంఖ్య చేరుకుంటుందన్నారు. అయితే ఆంతర్జాతీయ, ద్వైపాక్షిక క్రికెట్ క్యాలెండర్ ద్వారా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయనే విషయాన్ని ధుమాల్ అంగీకరించారు. ఏడాదికి రెండు ఐపీఎల్​లు నిర్వహిస్తే సమయం దొరకడం చాలా కష్టం అవుతుందని, కానీ ఎలా ప్లాన్ చేయాలో కచ్చితంగా పరిశీలిస్తామని తెలిపారు.

మరింత జోష్​తో
కాగా ఏడాదికి రెండు ఐపీఎల్​లను నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో పలువురు అభిప్రాయాలను ధుమాల్ అంగీకరించారు. 2025లో జరిగే మెగా వేలంలో ఫ్రాంచైజీలు కేవలం ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుని మిగతా జట్టు సభ్యులను విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఐపీఎల్​ కొత్త ప్రణాళిక మరింత జోష్​ను నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక 2024 ఐపీఎల్​ మార్చి 22న ప్రారంభం కానుందని అరుణ్ ధుమాల్‌ ఇప్పటికే ప్రకటించారు. లోక్​సభ ఎన్నికలు ఉన్నప్పటికీ పూర్తి టోర్నమెంట్​ను భారత్​లోనే నిర్వహిస్తామని ధుమాల్ స్పష్టం చేశారు. తొలి రెండు వారాల షెడ్యూల్ మాత్రమే ప్రకటించగా, సాధారణ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్​ల షెడ్యూల్ ఖరారు చేస్తామని ఆయన అన్నారు.

రిచా తుపాన్ ఇన్నింగ్స్​- అయినా ఓడిన ఆర్సీబీ- ' స్టార్' అంటూ సూర్య ప్రశంస

అదరగొట్టిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ - రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.