Travis Head Record : ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ టీమ్ఇండియాకు కొరకరాని కొయ్యగా మారాడు. గబ్బా వేదికగా జరగుతున్న మూడో టెస్టులోనూ శతకం బాదాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా హెడ్‌కు ఇది తొమ్మిదో శతకం. అందులో మూడు సెంచరీలు టీమ్ఇండియాపైనే బాదడం గమనార్హం. అయితే గబ్బాలో సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్ మరో అరుదైన ఘనత సాధించాడు. అదేంటంటే?
ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఒకే వేదికపై కింగ్ పెయిర్ & శతకం సాధించిన ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్ రికార్డు సృష్టించాడు. ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ తొలి బంతికే డకౌట్ అవ్వడాన్ని కింగ్ పెయిర్ అంటారు. గబ్బా వేదికగా అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయ్యాడు. వెస్టిండీస్ కంటే ముందు జరిగిన మ్యాచ్‌లోనూ హెడ్ గోల్డెన్ డకౌటవ్వడం గమనార్హం.
ఆరో ప్లేయర్!
గబ్బా వేదికగా ఆడిన గత మూడు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో గోల్డెన్ డకౌటైన ట్రావిస్ హెడ్, టీమ్ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. కాగా, ఓ క్యాలెండ్ ఇయర్‌లో ఓ వేదికపై పెయిర్ & సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్‌గా హెడ్ రికార్డులకెక్కాడు. హెడ్ కంటే ముందు 1958లో వాజిర్ మహ్మద్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), 1974లో అల్విన్ కల్లిచరణ్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), 2001లో మార్వన్ ఆటపట్టు (కొలంబో), 2004లో రామ్ నరేశ్ శర్వాన్ (కింగ్‌స్టన్), 2004లో మహ్మద్ అష్రాఫుల్ (ఛటోగ్రామ్) క్యాలెండర్ ఇయర్‌లో ఒకే వేదికపై పెయిర్ & సెంచరీ చేసిన ఆటగాళ్లుగా నిలిచారు.
𝖀𝖓𝖘𝖙𝖔𝖕𝖕𝖆𝖇𝖑𝖊 💯
— ICC (@ICC) December 15, 2024
Take a bow, Travis Head!#WTC25 | #AUSvIND 📝: https://t.co/2NElbX9Qdj pic.twitter.com/J5zdg101RL
టెస్టుల్లో గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో భారత్ పై హెడ్ సాధిందిన పరుగులు
- 90(163)
- 163(174)
- 18(27)
- 11(13)
- 89(101)
- 140(141)
- 152(118)
ఇక ముడో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 405-7 స్కోర్‌తో పటిష్ఠ స్థితిలో ఉంది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కేరీ (45 పరుగులు), మిచెల్ స్టార్క్ (7 పరుగులు) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టాడు. సిరాజ్, నితీశ్ కుమార్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
బెయిల్స్ మార్చిన సిరాజ్ - లబుషేన్‌పై హేడెన్ తీవ్ర విమర్శలు
గబ్బా టెస్టు : బుమ్రా పాంచ్ పటాకా- అయినా రెండో రోజు ఆసీస్‌దే!