ETV Bharat / sports

ICC సర్​ప్రైజింగ్ షెడ్యూల్- టోర్నీలో భారత్ X పాక్​ మ్యాచ్ లేదేంటి? - India vs Pakistan

author img

By ETV Bharat Sports Team

Published : Aug 18, 2024, 4:41 PM IST

India vs Pakistan: ఐసీసీ టోర్నమెంట్ అనగానే అందరూ ఇండోపాక్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ, ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ఓ టోర్నీ షెడ్యూల్​లో మాత్రం భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లేదు.

India vs Pakistan
India vs Pakistan (Source: Getty Images)

India vs Pakistan: ఐసీసీ టోర్నమెంట్ అనగానే యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి భారత్- పాకిస్థాన్ మ్యాచ్ పైనే ఉంటుంది. ఐసీసీ షెడ్యూల్ విడుదల చేయగానే ఈ దాయాదుల పోరు ఎప్పుడు ఉందా అని వెతుకుతుంటారు. హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్​ ఎంతో ఆతృతగా ఉంటారు. అయితే ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఓ టోర్నమెంట్ షెడ్యూల్​లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లేకుండానే గ్రూప్ స్టేజ్ ముగుస్తుంది. మరి ఆ టోర్నీ ఏదంటే?

మహిళల అండర్ 19 వరల్డ్​కప్ రెండో ఎడిషన్ టోర్నీ 2025లో జరగనుంది. ఈ టోర్నమెంట్​కు మలేసియా ఆతిథ్యం ఇవ్వనుంది. 16 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీ షెడ్యూల్​ను ఐసీసీ ఆదివారం రిలీజ్ చేసింది. అయితే ఇందులో గ్రూప్ స్టేజ్​లో మాత్రం భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లేదు.

16 జట్లను నాలుగు గ్రూపులు (A, B,C, D) గా విభజించారు. ఒక్కో జట్టు తమ గ్రూప్​లోని మిగిలిన మూడు టీమ్స్​తో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇక నాలుగు గ్రూప్​ల్లో టాప్-3లో నిలిచిన 12జట్లు సూపర్ 6కు అర్హత సాధిస్తాయి. అందులో A, D గ్రూప్​ల్లోని ఆరు జట్లను మళ్లీ గ్రూప్-1, B, Cలోని టీమ్స్​ను గ్రూప్- 2గా విభజించి సూపర్ 6 మ్యాచ్​లు నిర్వహిస్తారు.

ఇక సూపర్​ 6లోనూ గ్రూప్-1, గ్రూప్-2 జట్లే పోటీపడతాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్- 2లో నిలిచిన జట్లు సెమీస్​లో తలపడుతాయి. సెమీస్​లో నెగ్గిన జట్లు ఫైనల్​ ఆడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ టోర్నీలో భారత్ గ్రూప్ Aలో, పాకిస్థాన్ Bలో ఉన్నాయి. దీంతో గ్రూప్ స్టేజ్​లో, సూపర్ 6లోనూ ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ జరిగే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్​లో దాయాది మ్యాచ్ చూడాలంటే భారత్- పాకిస్థాన్ ఫైనల్​కు రావాల్సిందే!

టోర్నీలో ఆడనున్న జట్లు

గ్రూప్ A గ్రూప్ Bగ్రూప్ C గ్రూప్ D
భారత్ఇంగ్లాండ్న్యూజిలాండ్ఆస్ట్రేలియా
వెస్టిండీస్పాకిస్థాన్సౌతాఫ్రికాబంగ్లాదేశ్
శ్రీలంకఐర్లాండ్ఆఫ్రికా క్వాలిఫైయర్ఆసియా క్వాలిఫయర్
మలేసియాఅమెరికాసమోవాస్కాట్లాండ్
  • ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 02 వరకు జరగనుంది.
  • సెమీఫైనల్- 1, సెమీఫైనల్- 2 రెండు మ్యాచ్​లు కూడా జనవరి 31న జరగనున్నాయి. (ఫిబ్రవరి 1 రిజర్వ్ డే)
  • ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 02న జరగనుంది (ఫిబ్రవరి 03 రిజర్వ్ డే)

టీమ్ఇండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లు

జనవరి 19భారత్ - వెస్టిండీస్
జనవరి 21భారత్ - మలేసియా
జనవరి 23భారత్ - శ్రీలంక

T20 వరల్డ్​కప్​పై బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్- టోర్నమెంట్ ఆ దేశానికి షిఫ్ట్​! - Womens T20 World Cup 2024

భారత్ అందుకే ఆతిథ్యం ఇవ్వట్లేదు - టీ20 మహిళా ప్రపంచకప్​ విషయంలో జై షా క్లారిటీ ఇదే! - T20 Womens World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.