Teamindia ICC World Test Championship : భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ముంబయిలో జరిగిన భారత జట్టు విజయోత్సవ ర్యాలీని చూస్తే మరోసారి అర్థమవుతుంది. ఆటగాళ్లు, ప్రజల్లో ఉద్వేగం చూస్తే, దశాబ్దానికి పైగా కప్పు కోసం ఎంతగా ఎదురుచూశారో అర్థమవుతుంది. చివరికి టీమ్ ఇండియా అనుకున్నది సాధించింది. లక్ష్యం నెరవేరంగానే స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ, జడేజా రిటైర్‌మెంట్ ప్రకటించేశారు. కోచ్ ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతా కోరుకున్నట్లే, ఆనందంగా టోర్నీ ముగిసింది అనుకునే లోపు, సగటు భారత క్రికెట్ అభిమాని మనసులో ఏదో వెలితి!
భారత జట్టు ఇప్పటి వరకు ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. అందులో రెండు వన్డే, రెండు టీ20, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. భారత కీర్తి కిరీటంలో ఇంకా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చేరలేదు. కోచ్‌గా చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ సైతం విరాట్ కోహ్లితో ఇదే మాట అన్నాడు.
- 2023లో వెంటాడిన దురదృష్టం
2011లో చివరిగా భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచింది. అప్పటి నుంచి ఐసీసీ ట్రోఫీలు అందినట్టే అంది దూరమైపోయాయి. రెండుసార్లు టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. 2021లో ఇండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది. అప్పుడు న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. వెంటనే పుంజుకుని 2021-2023 టెస్టు ఛాంపియన్‌షి సైకిల్లోనూ భారత్ అద్భతంగా ఆడింది. ఫైనల్‌కు క్వాలిఫై అయింది. కానీ ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో గట్టి పోటీ ఇవ్వకుండానే కప్పును వదిలేసింది.
- ఈ సారైనా కల నెరవేరుతుందా?
ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలకు కెప్టెన్ రోహిత్ శర్మ బ్రేక్ వేశాడు. టీ20 ప్రపంచకప్ విజయంతో టీమ్ ఇండియాలో జోష్ పెరిగింది. ఈ సారి భారత్ టార్గెట్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్. ఈ ఏడాది భారత్ వన్డేల కంటే ఎక్కువగా టెస్ట్ సిరీస్‌లు ఆడుతోంది. షెడ్యూల్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లు ఉన్నాయి. ఏకంగా ఇండియా 15-16 టెస్టులు ఆడబోతోంది. టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులకు అందుబాటులో ఉంటారు. ఈ స్టార్లకు టెస్టులపై ఎక్కువ ఫోకస్ చేసే సమయం ఉండటం కలిసొచ్చే అంశం. టీ20 గెలిచిన స్ఫూర్తితోనే ఆ ఒక్క ట్రోఫీని టీమ్ ఇండియా ముద్దాడాలని భారతదేశం కోరుకుంటోంది.
రోహిత్‌కు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ తిరిగి ఇచ్చేస్తారా? - Rohith Sharma Nita Ambani