ICC Team Ranking 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మూడు ఫార్మాట్ల టీమ్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో 124 రేటింగ్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, వన్డే (122 రేటింగ్స్), టీ20 (264 రేటింగ్స్) ఫార్మాట్లలో భారత్ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. కాగా, టెస్టుల్లో భారత్ 120 రేటింగ్స్‌తో రెండో స్థానంలో ఉంది.
టెస్టుల్లో టాప్- 5 జట్లు
- ఆస్ట్రేలియా- 124 రేటింగ్స్
- భారత్- 120 రేటింగ్స్
- ఇంగ్లాండ్ - 105 రేటింగ్స్
- సౌతాఫ్రికా- 103 రేటింగ్స్
- న్యూజిలాండ్- 96 రేటింగ్స్
వన్డేల్లో టాప్- 5 జట్లు
- భారత్- 122 రేటింగ్స్
- ఆస్ట్రేలియా- 116 రేటింగ్స్
- సౌతాఫ్రికా - 112 రేటింగ్స్
- పాకిస్థాన్- 106 రేటింగ్స్
- న్యూజిలాండ్- 101 రేటింగ్స్
టీ20ల్లో టాప్- 5
- భారత్- 264 రేటింగ్స్
- ఆస్ట్రేలియా- 257 రేటింగ్స్
- ఇంగ్లాండ్-252 రేటింగ్స్
- సౌతాఫ్రికా- 250 రేటింగ్స్
- న్యూజిలాండ్- 252 రేటింగ్స్.
అయితే 2021 మే తర్వాత ఆయా టీమ్‌ల ప్రదర్శనల ఆధారంగా ఈ ర్యాంకులు దక్కాయి. దాదాపు రెండేళ్ల కాలంలో ఆయా జట్ల విజయాలు, పెర్ఫార్మెన్స్లు పరిగణలోకి తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలో గతేడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టిన ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో నెగ్గడం వల్ల టెస్టుల్లో ఆగ్రస్థానానికి చేరుకుంది.
World Test Championship: 2023-25 డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మాత్రం టీమ్ఇండియానే అగ్రస్థానంలో ఉంది. 2023- 25 సైకిల్లో 9 మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా ఆరింట్లో నెగ్గి, 2 ఓడి, 1 డ్రా చేసుకుంది. ఈ క్రమంలో 68.51 పాయింట్ పర్సెంటేజీతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 62.50 పాయింట్ పర్సెంటేజీతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Men's batting rankings: ఇక పురుషుల బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ టెస్టుల్లో టాప్‌లో ఉన్నాడు. అతడు 859 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డేల్లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (824 రేటింగ్స్) టాప్ పొజిషన్లో ఉండగా, టీ20ల్లో మిస్టర్ 360 డిగ్రీల ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (861 రేటింగ్స్) తొలి ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు.
కెరీర్లో బెస్ట్ ప్లేస్‌కు యశస్వి- టాప్ 10లోకి దూసుకుపోయాడుగా
చరిత్ర సృష్టించిన బుమ్రా- టీమ్ఇండియా నుంచి తొలి పేసర్‌గా రికార్డ్