Sanju Samson World Cup: ఆటలో లోపం లేదు. ప్రతిభకు కొదువ లేదు. కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. టీమ్ఇండియా సీనియర్ జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారిపోయింది. ఎంతలా అంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏదైనా ముఖ్యమైన సిరీస్ లేదా పెద్ద టోర్నీ కోసం టీమ్ఇండియా జట్టును సెలెక్ట్ చేస్తే అతడి పేరు కచ్చితంగా ఉండాలన్న డిమాండ్ కచ్చితంగా గట్టిగా వినిపిస్తుంది. కానీ చివరి అతడి పేరు కనిపించేది కాదు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ అతడి పేరు లేకపోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అతడు మరెవరో కాదు సంజూ శాంసన్. కానీ ఇదంతా మొన్నటి వరకు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో సెలక్టర్లు మొండిచేయి చూపకుండా అతడిని ఎంపిక చేశారు. పైగా అతడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫామ్‌లో ఉండడంతో వరల్డ్ కప్‌లోనూ అలానే చెలరేగి ఆడుతాడన్న ఆశలు అందరిలో పుట్టుకొచ్చాయి.
ఈ సారి మాత్రం అలా కాదు: వాస్తవానికి ఐపీఎల్‌లో చాలా సీజన్ల నుంచి శాంసన్ మొదట మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఆ తర్వాత నిలకడ తప్పుతుంటాడు. మొదటి నుంచి ఇది ఇలానే కొనసాగుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం అలా కాదు. మధ్యలో ఫామ్ కోల్పోకుండా మొదటి నుంచి నిలకడ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 471 పరుగులు చేశాడు. 67.28 సగటు కాగా స్ట్రైక్ రేట్ 163.54 ఉండటం విశేషం. ఇది చిన్న విషయం కాదనే చెప్పాలి.
పైగా వరల్డ్ కప్‌లో చోటు కన్ఫామ్ అయ్యాక కూడా అతడేమీ రిలాక్స్ అయిపోలేదు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 86 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిటాడు. పాయింట్ల పట్టికలో తన జట్టు రాజస్థాన్ దూసుకెళ్లడానికి ప్రధాన కారణమయ్యాడు. దీంతో వరల్డ్ కప్ ముంగిట శాంసన్ ఇలాంటి ప్రదర్శన కనబరచడం అతడి అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది.
అవకాశాలు తక్కువే: ఐపీఎల్‌లో ఎప్పటి నుంచి రాణిస్తున్నా సంజూ శాంసన్‌కు జ-ాతీయ జట్టులో చోటు దక్కిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ దక్కినా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయాడు. ముందుగా టీ20ల్లో అతడికి అవకాశాలు వచ్చాయి. 25 మ్యాచ్‌లు ఆడిన అతడు 18.70 సగటుతో 374 పరుగులే ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. వన్డేల్లో సంజూ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. 16 మ్యాచులు ఆడిన అతడు 56.66 యావరేజ్‌తో 510 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. అందులో సౌతాఫ్రికాపై బాదిన శతకం (108) కూడా ఉంది.
ఆ శతకమే మలుపు తిప్పింది: ఆ సెంచరీనే సంజు ఇంటర్నేషన్ కెరీర్ మలుపు తిప్పింది. సెలక్టర్లకు కాస్త నమ్మకాన్ని కలిగించింది. పైగా ఇప్పుడు ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. అందుకే అతడికి చోటు ఇచ్చాడు. పంత్ తర్వాత రెండో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ లాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నసంజుకే అవకాశం ఇచ్చారు. మరి తనకొచ్చిన ఈ టీ20 ప్రపంచకప్ ఛాన్స్‌ను అతడు వినియోగించుకుంటే జట్టులో స్థానం సుస్థిరం అవుతుంది.
అంపైర్‌తో పెద్ద గొడవ - సంజూకు భారీ జరిమానా - IPL 2024
సంజూ శాంసన్ చారులత లవ్ జర్నీ - అలా వీరిద్దరు ఒక్కటయ్యారు! - Sanju Samson Love story