ETV Bharat / sports

గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ కన్ఫార్మ్- కొత్తగా ముగ్గురికి ప్లేస్! - Gambhir Support Staff

Gautam Gambhir Support Staff: టీమ్ఇండియా కొత్త హెడ్​కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ ఎంపిక దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. కొత్త సపోర్టింగ్ స్టాఫ్ శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియాతో చేరనున్నట్లు సమాచారం.

Gambhir Support Staff
Gambhir Support Staff (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 3:21 PM IST

Updated : Jul 20, 2024, 3:34 PM IST

Gautam Gambhir Support Staff: టీమ్ఇండియా కొత్త హెడ్​కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ ఎంపికపై గత కొన్నిరోజులుగా ఆసక్తి నెలకొంది. జట్టుకు కొత్త బ్యాటింగ్, బౌలింగ్ కోచ్​లు ఎంపికకానున్నారని ప్రచారం కూడా సాగింది. ఈ క్రమంలో గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్​ కోసం ఆరుగురి పేర్లను ప్రతిపాదిస్తే, బీసీసీఐ దాన్ని తిరస్కరించిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది.

టీమ్ఇండియా మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్​, హెడ్​కోచ్​ గంభీర్​కు అసిస్టెంట్ కోచ్​గా ఎంపికైనట్లు సమాచారం. అలాగే నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు టెన్ డెష్కటే కూడా గంభీర్ స్టాఫ్​లో చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అభిషేక్ నాయర్ సోమవారం (జులై 22న) టీమ్ఇండియా జట్టుతో కొలంబో వెళ్లనున్నాడు. మరోవైపు టెన్ డెష్కటే డైరెక్ట్​గా కొలంబో వెళ్లి భారత్ జట్టుతో చేరనున్నాడని బోర్డు మెంబర్ ఒకరు తెలిపారు. దీంతో ఈ ఇద్దరూ సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్లుగా ఖరారైనట్లేనని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. కాగా, సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమ్ఇండియా కొత్త బౌలింగ్ కోచ్​గా ఎంపికవడం కూడా దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక ఫీల్డింగ్ కోచ్​గా టీ దిలీప్ అలాగే కొనసాగనున్నాడు.

గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ అండ్ టీమ్!

  • అసిస్టెంట్ కోచ్​లు: అభిషేక్ నాయర్, టెన్ డెష్కటే
  • బౌలింగ్ కోచ్: మోర్నీ మోర్కెల్
  • ఫీల్డింగ్ కోచ్: టీ. దిలీప్
  • వన్డే, టెస్టు కెప్టెన్: రోహిత్ శర్మ
  • టీ20 కెప్టెన్: సూర్యకుమార్ యాదవ్

మీడియా ముందుకు అప్పుడే
గంభీర్ జట్టు కోచ్​గా ఎంపికైన తర్వాత మీడియా ముందుకు రాలేదు. అయితే శ్రీలంక పర్యటనకు సోమవారం టీమ్ఇండియా కొలంబో బయల్దేరనుంది. ఆ రోజే గంభీర్ మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా అదే రోజు గంభీర్​కు అఫీషియల్​గా కోచ్ బాధ్యతలు అప్పజెప్పనుంది. కాగా, శ్రీలంక పర్యటన జులై 27న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్ 3టీ20, 3వన్డే మ్యాచ్​లు ఆడనుంది.

శ్రీలంక టూర్ షెడ్యూల్:

జులై 27తొలి టీ20
జులై 28రెండో టీ20
జులై 30 మూడో టీ20
ఆగస్టు 02తొలి వన్డే
ఆగస్టు 04రెండో వన్డే
ఆగస్టు 07మూడో వన్డే

టీ20 జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్​మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్​ సిరాజ్.

వన్డే జట్టు: రోహిత్‌(కెప్టెన్‌), గిల్‌ (వైస్ కెప్టెన్), కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌(వికెట్ కీపర్), రిషభ్‌(వికెట్ కీపర్), శ్రేయస్‌, శివమ్‌, కల్దీప్‌, సిరాజ్‌, వాషింగ్టన్‌, అర్ష్‌దీప్‌, రియాన్‌, అక్షర్‌, ఖలీల్‌, హర్షిత్‌ రాణా

శ్రీలంక టూర్​​ జట్టు ప్రకటన - వన్డే కెప్టెన్​గా రోహిత్​, టీ20 సారథి​ ఎవరంటే? - TeamIndia Squad for SriLanka 2024

'మా రిలేషన్ ప్రేక్షకులకు మసాలా కంటెంట్ కాదు' - గొడవలపై గంభీర్, కోహ్లీ రియాక్షన్! - Virat Kohli About Gautam Gambhir

Last Updated : Jul 20, 2024, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.