IND vs NZ 2nd Test 2024 : న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వరుసగా బోల్తా కొడుతోంది. ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలవ్వగా, పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ విఫలమైంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌట్ అవ్వగా, భారత్ 156రన్స్‌కే చాపచుట్టేసింది. భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. దీంతో టీమ్ఇండియా డిఫెండబుల్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాను జట్టులోకి తిరిగి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
'పుజారాను తీసుకోండి'
టీమ్ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రంజీల్లో అదరగొడుతున్న ఛెతేశ్వర్ పుజారాను జట్టులోకి తీసుకురావాలని సెలక్టర్లను కోరుతున్నారు. 'మాకు ఛెతేశ్వర్ పుజారా కావాలి. ఆసీస్ పిచ్‌ల్లో వైట్ బాల్ స్పెషలిస్ట్ బ్యాటర్లు రాణించలేరు. రోహిత్ శర్మ సీమ్ పిచ్ లపై బ్యాటింగ్ సరిగ్గా చేయలేడు. సీనియర్లందర్నీ దేశీయ క్రికెట్ ఆడేలా చేయాలి' అని ఒక అభిమాని ఎక్స్‌లో పోస్టు చేశాడు.
We need Cheteshwar Pujara back.
— Mr. Somebody 🇮🇳 (@scorpioyadav) October 25, 2024
These white ball specialists will be worth nothing in Aussie conditions. Rohit Sharma can’t even bat to save his life on seaming wickets.
All seniors should be made to play domestic cricket before catching the flight to Oz.#INDvsNZ @BCCI #INDvNZ
What a collapse by Indian batters in Pune they are not able to play simple spin . Recently they had lost series in Sri Lanka now they are going to lose it here in India
— World of Facts (@factostats) October 25, 2024
అప్పుడు అలా, ఇప్పుడు ఇలా
టీమ్ఇండియా బ్యాటర్లు రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యారని మరో ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ఒక మ్యాచ్‌లో పేస్ బౌలింగ్‌కు కుప్పకూలగా, మరొక మ్యాచ్‌లో స్పిన్‌కు వికెట్లు సమర్పించుకున్నారని అన్నాడు. దీనిపై ఎలాంటి సాకులు చెప్పలేరని తెలిపాడు. ఏడేళ్ల క్రితం పుణెలో ఆస్ట్రేలియా బౌలర్ స్టీవ్ ఒకీఫ్ భారత్‌పై 6వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత కివీస్ ఆటగాడు 7వికెట్లు తీశాడని పోస్టులో పేర్కొన్నాడు. టీమ్ఇండియా బ్యాటింగ్ ఏ మాత్రం మారలేదని తెలిపాడు. భారత బ్యాటర్లు శాంటర్న్ను ఎదుర్కొలేకపోయారని మరో అభిమాని పోస్టు చేశాడు. భారత్ గడ్డ, ప్రేక్షకుల మధ్య విదేశీ ఆటగాడు అదరగొట్టాడని అందులో పేర్కొన్నాడు.
Shubman Gill 🔁Cheteshwar Pujara#INDvsNZ #ShubmanGill pic.twitter.com/8VOts862Ew
— jazbaat (@R_Vinod01) October 25, 2024
Cheteshwar Pujara Test Career : ఛతేశ్వర్ పుజారా 2010లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాపై తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన పుజారా 7195 రన్స్ చేశాడు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక భారత్ తరఫున 2023లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
25వ రంజీ సెంచరీ బాదిన పుజారా - బ్రియాన్ లారా రికార్డ్ బ్రేక్