Team India Cricketers Mother Tongue: భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు ఆఫీసులను సైతం మానేసి టీవీ, ఫోన్లకు అతుక్కుపోతుంటారు. అంతలా క్రికెట్ అంటే ఇష్టం భారతీయులకు. అయితే టీమ్ఇండియాకు పలు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్లు ఏయే భాషలు మాట్లాడతారు? టీమ్ఇండియా ప్లేయర్ల మాతృభాష ఏది? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- రోహిత్ శర్మ: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వస్థలం ముంబయి. రోహిత్ మాతృభాష మరాఠీ. తన తల్లిది విశాఖపట్నం కావడం వల్ల రోహిత్ తన మాతృభాష మరాఠీతో పాటు తెలుగు, హిందీ కూడా మాట్లాడుతాడు.
- విరాట్ కోహ్లీ: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాతృభాష పంజాబీ. అయినప్పటికీ కింగ్ కోహ్లీ హిందీ, పంజాబీని మాట్లాడుతాడు.
- శుభమన్ గిల్: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ మాతృభాష పంజాబీ. అలాగే టీమ్ఇండియా మహిళా జట్టు ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్, భారత మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మాతృభాష కూడా పంజాబీయే.
- ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ : టీమ్ఇండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్, బౌలర్ కుల్దీప్ యాదవ్ మాతృభాష భోజ్‌పురి. వీరు హిందీని కూడా మాట్లాడుతారు.
- రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, దినేశ్ కార్తీక్ : స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ మాతృభాష తమిళం. అలాగే భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాతృభాష తమిళమే.
- రవీంద్ర జడేజా: స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాతృభాష గుజరాతీ. జడ్డూ హిందీలో కూడా మాట్లాడుతాడు. అక్షర్ పటేల్, జైదేవ్ ఉనాద్కత్ మాతృభాష కూడా గుజరాతీనే.
- కేఎస్ భరత్: నయా వికెట్ కీపర్ కేఎస్ భరత్ మాతృభాష తెలుగు. భరత్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారత మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు మాతృభాష కూడా తెలుగే.
- మహ్మద్ సిరాజ్: భారత పేసర్ మహ్మద్ సిరాజ్ స్వస్థలం తెలంగాణ హైదరాబాద్. అతని మాతృభాష ఉర్దూ. అలాగే తెలుగు, హిందీలో కూడా సిరాజ్ మాట్లాడగలరు.
- జస్ప్రీత్ బుమ్రా: యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా పుట్టింగి గుజరాత్ రాష్ట్రంలో. అయితే తన స్వస్థలం మాత్రం పంజాబ్. అందుకే బుమ్రా గుజరాత్‌తోపాటు పంజాబీ, హిందీ కూడా మాట్లాడుతాడు.
- హార్దిక్ పాండ్య: ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మాతృభాష గుజరాతీ. అతడి స్వస్థలం బరోడా. పాండ్య బ్రదర్స్ గుజరాతీ, హిందీ మాట్లాడగలరు.
- కేఎల్ రాహుల్: కర్ణాటకలోకి మంగళూరుకు చెందిన కేఎల్ రాహుల్ మాతృభాష కన్నడ. అలాగే భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప, ప్రసిద్ధ్ కృష్ణ, వినయ్ కుమార్ మాతృభాష కూడా కన్నడే.
- సంజు శాంసన్: యంగ్ ప్లేయర్ సంజు శాంసన్, మాజీ బౌలర్ శ్రీశాంత్ మాతృభాష మలయాళం. వీరిద్దరూ కేరళకు చెందినవారు. శాంసన్ ఇంగ్లీష్, మలయాళం మాట్లాడుతాడు.
- వృద్ధిమాన్ సాహా: సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాతృభాష బెంగాలీ.
బహుళ భాషలు మాట్లాడగల భారత ప్లేయర్లు: దాదాపుగా టీమ్ఇండియా క్రికెటర్లు అందరూ హిందీతోపాట ఇంగ్లీష్‌లోనూ అనర్గళంగా మాట్లాడుతారు. మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ తన మాతృభాష కన్నడ, అలాగే మరాఠీని మాట్లాడగలరు. భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ తన మాతృభాష మరాఠీ, బెంగాలీ మాట్లాడుతారు. దినేశ్ కార్తీక్ తమిళం, తెలుగు, మలయళంలో మాట్లాడగలరు.
A Throwback video of Rohit Sharma speaking Telugu 😄👌
— Johns. (@CricCrazyJohns) March 27, 2024
- The main man of Hyderabad is landing today. pic.twitter.com/vC79zGVvab
Captain Rohit Sharma speaking TELUGU. 😀🔥 pic.twitter.com/ICTDkiGoGd
— Johns. (@CricCrazyJohns) July 15, 2024
క్రికెట్ కోసం ప్రేయసికి షరతు! గంభీర్,నటాషా లవ్ స్టోరీ గురించి తెలుసా? - Gautam Gambhir Love Story