TeamIndia New HeadCoach : T20 ప్రపంచ కప్ 2024 తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్‌ను వెతికే పనిలో బీసీసీఐ కొంత కాలంగా బిజీగా ఉంటోంది. ఈ పదవి కోసం ఇప్పటికే గౌతమ్ గంభీర్ దాదాపుగా ఖారరయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్త పేరు రేసులోకి వచ్చింది. మాజీ ప్లేయర్ ఒకరు ఈ పదవి కోసం దరఖాస్తు చేయగా అతడిని ఇంటర్వ్యూ చేశారట. అలా మరో విదేశీ మాజీ ప్లేయర్‌ను కూడా ఇంటర్వ్యూ చేయనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం గురించి ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇంతకీ అతనెవరంటే? - టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్, తమిళనాడు బ్యాటర్ WV రామన్ ఈ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారట. దీంతో బీసీసీఐ ఆయన పేరును పరిశీలించిందట. అలాగే రామన్‌ను క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేసినట్లు తెలిసింది. ఇంటర్వ్యూలో రామన్ తీరు ఆకట్టుకునేలా, వివరంగా ఉందని బీసీసీఐకి తెలియజేసినట్లు కథనాల్లో రాసి ఉంది.
"గంభీర్‌కు కూడా వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే రామన్ ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరణాత్మక సమాధానాలు, టీమ్‌ఇండియా కోసం భవిష్యత్ ప్రణాళికలు ఆకట్టుకున్నాయి. క్రికెట్ అడ్వైజరీ కమిటీ మరో విదేశీ అభ్యర్థిని కూడా ఇంటర్వ్యూ చేయనుంది" అని బీసీసీఐకి చెందిన ఓ వ్యక్తి చెప్పారు.
కాగా, రామన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పటికీ కూడా బీసీసీఐ గౌతమ్ గంభీర్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇకపోతే హెడ్ కోచ్ ఎంపికతో పాటు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ప్యానెల్‌కు కూడా కొత్త సెలెక్టర్‌ను ఎంపిక చేసే పనిలో ఉంది బీసీసీఐ. ఏదేమైనా రానున్న రోజుల్లో భారత క్రికెట్‌లో మరిన్ని గణనీయమైన మార్పుల కోసం బీసీసీఐ ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటోందట. కొత్త కోచ్, సెలెక్టర్ నియామకాలు జట్టులో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తోందట. దీంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందా అని క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నికోలస్ పూరన్ విధ్వంసం - ఒకే ఓవర్లో 36 పరుగులు - T20 Worldcup 2024