T20 Worldcup 2024 Rohith sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సూపర్ రికార్డ్ సాధించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో నాకౌట్ మ్యాచ్‌లో అర్ధ శతకం బాదిన తొలి భారత కెప్టెన్‌గా ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది.
ఈ పోరులో రోహిత్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 57) హాఫ్ సెంచరీతో బాదాడు. దీంతో టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అర్ధ శతకం నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అప్పటి కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్ చేసిన హయ్యెస్ట్ స్కోర్ ఇదే. ఇప్పుడు దాన్ని రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.
రోహిత్@5000(Rohith Sharma 5000 runs) - టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగుల మార్క్‌ను టచ్ చేశాడు. ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ 12883 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ధోనీ 11207, మహమ్మద్ అజారుద్దీన్ 8095, గంగూలీ 7643 రోహిత్ కన్నా ముందున్నారు.
అత్యధిక సిక్స్‌లు - టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి టీమ్ఇండియా బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు హిట్ మ్యాన్ 50 సిక్స్‌లు బాదాడు. 63 సిక్స్‌లతో క్రిస్ గేల్ ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు.
బాబర్ ఆజామ్ రికార్డ్ బ్రేక్ - అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గానూ హిట్ మ్యాన్ మరో రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు బాబర్ ఆజామ్ రికార్డును అధిగమించాడు. ఇప్పటి వరకు 61 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన రోహిత్ శర్మ 49 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. బాబర్ ఆజామ్ 85 మ్యాచ్‌ల్లో 48 విజయాలను అందుకున్నాడు.
𝙄𝙣𝙩𝙤 𝙏𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡𝙨! 🙌 🙌#TeamIndia absolutely dominant in the Semi-Final to beat England! 👏 👏
— BCCI (@BCCI) June 27, 2024
It's India vs South Africa in the summit clash!
All The Best Team India! 👍 👍#T20WorldCup | #INDvENG pic.twitter.com/yNhB1TgTHq
దెబ్బకు దెబ్బ - ఇంగ్లాండ్ చిత్తు, ఫైనల్‌కు టీమ్ఇండియా - T20 Worldcup 2024 Final
'దీన్ని మేం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం'- రషీద్ ఎమోషనల్ ట్వీట్ - T20 world cup 2024