ETV Bharat / sports

నికోలస్ పూరన్ విధ్వంసం - ఒకే ఓవర్​లో 36 పరుగులు - T20 Worldcup 2024 - T20 WORLDCUP 2024

T20 Worldcup 2024 Nicholas Pooran : టీ20 క్రికెట్​ చరిత్రలో నిలిచిపోయేలా వెస్టిండీస్ క్రికెటర్​ నికోలస్ పూరన్​ అదిరే ప్రదర్శన చేశాడు. ఒక్క ఓవర్​లో ఏకంగా 36 పరుగులు చేశాడు. పూర్తి వివరాలు స్టోరీలో

Source ANI
T20 Worldcup 2024 Nicholas Pooran (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 8:56 AM IST

Updated : Jun 18, 2024, 9:26 AM IST

T20 Worldcup 2024 Nicholas Pooran : టీ20 క్రికెట్​ చరిత్రలో నిలిచిపోయేలా వెస్టిండీస్ క్రికెటర్​ నికోలస్ పూరన్​ అదిరే ప్రదర్శన చేశాడు. టీ20 వరల్డ్​ కప్​లో భాగంగా గ్రూప్​ సిలో అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచులో ధనాధన్​ బ్యాటింగ్​తో విరుచుకుపడి విధ్వంసం సృష్టించాడు. సింగిల్ ఓవర్​లో ఏకంగా 36 పరుగులు చేశాడు. అఫ్గాన్ బౌలర్​ అజ్మతుల్లా ఒమార్జాయ్ బౌలింగ్​లో ఉతికారేశాడు.​

ఈ మ్యాచ్​లో మొదట వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. అయితే నాలుగు ఓవర్లకు 73/1 స్కోర్ ఉన్న దశలో పూరన్​, జాన్సన్​ చార్లెస్​ క్రీజులో కొనసాగుతున్నారు. అప్పుడు అజ్మతుల్లా ఒమార్జాయ్ బౌలింగ్​కు దిగాడు. అప్పుడు పూరన్​ ధనాధన్​ బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో ఆ ఒక్క ఓవర్​లోనే ఏకంగా 36 పరుగులు వచ్చాయి. తద్వారా టీ20 క్రికెట్​లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్​గా మార్చాడు. మొత్తంగా 53 బంతుల్లో 184 స్ట్రైక్​ రేట్​, 6 ఫోర్లు 8 సిక్స్​ల సాయంతో 98 పరుగులు చేశాడు. చివరకి అజ్మతుల్లా బౌలింగ్​లోనే రనౌట్​గా వెనుదిరిగాడు. పూరన్‌కు తోడుగా ఓపెనర్ చార్లెస్ (27 బంతుల్లో, 8 ఫోర్ల సాయంతో 43 పరుగులు) కూడా చెలరేగడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 218 పరుగులు చేసింది.

ఓవర్ సాగిందిలా - నాలుగో ఓవర్ వేసిన అజ్మతుల్లాకు పూరన్ సిక్సర్‌తో స్వాగతం పలికాడు. సెకండ్ బాల్​ను ఫోర్ బాదాడు. కానీ అది నోబాల్. దీంతో ఒత్తిడికి గురైన అజ్మతుల్లా ఫ్రీహిట్‌ను భారీ వైడ్‌‌గా వేశాడు. అది బౌండరీకి చేరి అదనంగా ఐదు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన ఫ్రీహిట్ బంతికి పరుగులేమి రాలేదు. కానీ ఆ తర్వాత పూరన్ బౌండరీల వర్షం కురిపించాడు. మూడో బాల్​ లెగ్‌బై రూపంలో బౌండరీ దక్కింది. నాలుగో బాల్​ను పాయింట్ మీదుగా ఫోర్ సాధించాడు. ఐదో బంతిని 89 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. ఇక ఆఖరి బంతిని కూడా లాంగాఫ్ మీదగా సిక్సర్‌ బాది ఏకంగా 36 పరుగులు సాధించాడు. అలా అరుదైన జాబితాలో పూరన్ చోటు దక్కించుకున్నాడు.

ఈ జాబితాలో ఎవరున్నారంటే? - ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా దిగ్గజ బ్యాటర్ల సరసన పూరన్ నిలిచాడు. అయితే ఈ ఫీట్​నుఇప్పటివరకుకొందరుఒంటిచేత్తో,మరికొందరుపార్టనర్‌తో అందుకున్నారు. ఈ టీ20ల్లో ఒక ఓవర్‌లో 36 పరుగులే అత్యధికం. ఈ జాబితాలో 36 - యువరాజ్ సింగ్ వర్సెస్​ స్టువర్ట్ బ్రాడ్ - 2007, కీరన్ పొలార్డ్ వర్సెస్​ ధనంజయ - 2007, రోహిత్ శర్మ అండ్​ రింకూ సింగ్ వర్సెస్​ కరీమ్ జనత్ - 2024, దీపేంద్ర సింగ్ వర్సెస్​ కమ్రాన్ ఖాన్ - 2024, పూరన్ అండ్ చార్లెస్ వర్సెస్​ అజ్మతుల్లా ఒమర్జాయ్ - 2024 ఉన్నారు.

T20 ప్రపంచకప్ 2026కు అర్హత సాధించిన 12 జట్లు ఇవే - T20 WorldCup 2026

ఫెర్గ్యూసన్ వరల్డ్​రికార్డ్- 4 ఓవర్లూ మెయిడెన్లే- 3 వికెట్లు కూడా

Last Updated : Jun 18, 2024, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.