T20 Worldcup 2024 Final Teamindia VS Southafrica Head To Head Records : టీ20 వరల్డ్ కప్ 2024 తుది దశకు చేరుకుంది. పొట్టి పోరులో కప్ కోసం జరిగిన పోటీలో 54 మ్యాచ్‌ల తర్వాత ఫైనల్‌లో సౌతాఫ్రికా, టీమ్ఇండియా ప్రత్యర్థులుగా నిలిచారు. గ్రూప్ ఏ నుంచి తలపడిన భారత జట్టు, గ్రూప్ డీ నుంచి పోరాడిన సఫారీ జట్టు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్-8లోనూ సత్తా చాటి ఫైనల్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితాలు, రెండు జట్లలో కీలక ప్లేయర్ల రికార్డులు ఓసారి పరిశీలిద్దాం.
ఫైనల్ పోరు వేదికైన బార్బడోస్ స్టేడియంలో గణాంకాలు ఇలా ఉన్నాయి.
- భారత్ ఆడింది 3. ఒకటి మాత్రమే గెలిచింది. అత్యధిక పరుగులు 181, అత్యల్ప స్కోరు 135.
- సౌతాఫ్రికా ఆడింది కూడా 3. రెండు గేమ్‌లు గెలిచింది. అత్యధికంగా 170 సాధిస్తే అత్యల్పంగా 129 నమోదు చేసింది.
- మొత్తంగా ఈ వేదికగా మొత్తం జరిగిన టీ20లు 32 కాగా మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 19 సార్లు గెలిచాయి. 11 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌ల ఫలితం తేలకుండాపోయింది.
Spin maestro Kuldeep Yadav leads the #T20WorldCup 2024 Set 9 Best XI 🌟🏏
— T20 World Cup (@T20WorldCup) June 28, 2024
How many of these players made your squad? 🔢 pic.twitter.com/BH5IB2d9sn
టీ20ల్లో సౌతాఫ్రికా వర్సెస్ టీమ్ఇండియా రికార్డులు విషయానికొస్తే
- ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల్లో టీమ్ఇండియా 14 సార్లు గెలవగా, సౌతాఫ్రికా 11సార్లు విజయం సాధించింది.
- తొలి సారి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 10 సార్లు గెలిస్తే, తొలిసారి బ్యాటింగ్ చేసి సౌతాఫ్రికా 3సార్లు మాత్రమే గెలుపొందింది.
- చేజింగ్ చేసి సౌతాఫ్ఱికా 8సార్లు గెలిస్తే, టీమిండియా 4సార్లు మాత్రమే గెలిచింది.
- టీమ్ఇండియాపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ డేవిడ్ మిల్లర్ (431), దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ రోహిత్ శర్మ (420) పరుగులు.
- పర్సనల్ స్కోర్లు ఇరు జట్లలో రోహిత్ శర్మది (106)గా ఉంటే డేవిడ్ మిల్లర్ కూడా అంతే (106)స్కోరుతో ఉన్నాడు.
- టీమ్ఇండియా హెయ్యస్ట్ స్కోరు 237, సఫారీల అత్యున్నత స్కోరు 227, టీమిండియా అత్యల్ప స్కోరు 92గా ఉంటే దక్షిణాఫ్రికాది 87గా ఉంది.
- టీ20 వరల్డ్ కప్‌లలో ఈ ఇరు జట్లు ఆరుసార్లు తలపడగా భారత్ నాలుగింట్లో, సౌతాఫ్రికా రెండింట్లో విజయం సాధించాయి.
- దక్షిణాఫ్రికాపై ఎక్కువ బౌండరీలు కొట్టింది రోహిత్ శర్మనే. 49 బౌండరీలతో రోహిత్ శర్మ ఉంటే డికాక్ 29 బాదాడు.
- ఎక్కువ సిక్సులు బాదింది మాత్రం డేవిడ్ మిల్లర్ (29) ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ (23)
- ఎక్కువ హాఫ్ సెంచరీలు సూర్య కుమార్ యాదవ్, డికాక్ లు సమానంగా చెరో నాలుగు నమోదు చేశారు.
- రోహిత్ శర్మ, సురేశ్ రైనా, సూర్య కుమార్ యాదవ్‌లు ఒక్కో సెంచరీ కొట్టగా, సౌతాఫ్రికా టీంలో డేవిడ్ మిల్లర్, రిలీ రుస్సోల పేరిట ఒక్కో సెంచరీ ఉంది.
- వికెట్లు ఎక్కువగా తీసిన వారిలో భువనేశ్వర్ కుమార్ 14 వికెట్లతో ఉంటే, 10 వికెట్లతో కేశవ్ మహరాజ్, 10వికెట్లతో లుంగి ఎంగిడి ఉన్నారు.
- బెస్ట్ బౌలింగ్‌తో కుల్దీప్ యాదవ్ (5/17), లుంగి ఎంగిడి (4/21) మంచి గణాంకాలు నమోదు చేశారు.
రోహిత్‌సేనకు సువర్ణావకాశం - అతడొక్కడు ఫామ్‌లోకి వస్తే కప్ మనదే! - T20 Worldcup 2024 Final
భారత్ 11ఏళ్లు, సౌతాఫ్రికా 26ఏళ్లు- రెండు జట్లదీ ఒకే పరిస్థితి! - T20 World Cup 2024 Final