T20 WORLD CUP schedule Full Details : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. మరో ఐదు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మొదలై క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. 55 మ్యాచ్‌లు జరిగే ఈ ఈవెంట్‌లో 20 జట్లు తలపడనున్నాయి. తొలిసారి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న అమెరికా గడ్డపై 16 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-ఏ మ్యాచ్‌లన్నింటికీ అమెరికానే ఆతిథ్యమిస్తుండగా, నాకౌట్ మ్యాచ్‌లు మొత్తం వెస్టిండీస్‌లో జరగనున్నాయి.
అమెరికాలోని ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్‌లలోని 9 వేదికల్లో మ్యాచులు జరుగుతుండగా, మిగిలినవి వెస్టిండీస్ అంటిగ్వా-బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్-గ్రెన్ డైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగా అతిథ్యమిస్తాయి. ఉదయం 5 గంటలు, 6 గంటలు, రాత్రి 8 గంటలు, రాత్రి 10:30, అర్ధ రాత్రి 12:30 ఇలా భిన్న సమయాల్లో మ్యాచ్ జరగనుండగా భారత మ్యాచులు ఆరంభమయ్యేది మాత్రం రాత్రి 8గంటలకు మాత్రమే. టీమిండియా మ్యాచ్‌లు జూన్ 2 నుంచి ఆరంభం కానున్నాయి.
టోర్నమెంట్ విధానం - అయితే ఈ టోర్నమెంట్లో ఆడే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. ఈ గ్రూపులోని ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఆడాల్సిందే. అలా ఆడి టాప్ 2లో నిలిచిన నాలుగు గ్రూపుల్లోని జట్లన్నీ కలిపి సూపర్ 8గా మారతాయి. మళ్లీ వాటిని రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్కడ కూడా టాప్ 2 సాధించిన ఇరు జట్లలోని నాలుగు టీంలు కలిపి సెమీఫైనల్‌లో పాల్గొంటాయి. ఏయే గ్రూపులో ఏయే జట్లు ఉన్నాయంటే..
గ్రూపు ఏ: భారత్, ఐర్లాండ్, కెనడా, పాకిస్తాన్, అమెరికా
గ్రూప్ బీ: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్
గ్రూప్ సీ: ఆఫ్గానిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్
గ్రూప్ డీ: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక
రాజు తలొంచాడు - ఎర్రకోటలో ఆఖరి ఆట! - Rafael Nadal French Open