Pakisthan Team Head Coach : పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా ఆసీస్ మాజీ ప్లేయర్ జాసన్ గిల్లెస్పీ బాధ్యతలు స్వీకరించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యార్క్‌షైర్ కోచ్‌గా సక్సెస్ అయిన గిల్లెస్పీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో రెండేళ్ల అగ్రిమెంట్‌పై సంతకం చేశాడు. ఆటగాళ్ళు తమ స,హజ నైపుణ్యాలకు కట్టుబడి ఉండాలని, పర్టికులర్ మెథడ్‌కు ఫిట్ కావాలని గేమ్ స్టైల్‌ను మార్చుకోకూడదని తాజా ఇంటర్వ్యూలో సూచించాడు. ఆటగాళ్లు పాజిటివ్ అండ్ అగ్రెసివ్వగా ఉండాలని పేర్కొన్నాడు గిల్లెస్పీ. టెస్ట్ క్రికెట్ ఛాలెంజింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో విజయం సాధించడానికి ఇది చాలా అవసరం అని అన్నాడు.
- కొత్తగా ఏదీ ట్రై చేయకూడదు - "పాక్ జట్టు తమకు సరిపోయే క్రికెట్ స్టైల్‌లో ఆడాలని కోరుకుంటున్నాను. నాకు అది ముఖ్యం. నా సైకాలజీ ఏంటంటే, డోంట్ ట్రై టూ బీ సమ్‌థింగ్ దట్ యు ఆర్ నాట్! ఏం చేయబోతున్నారనేదానిపై అథెంటిక్‌గా ఉండాలి. నేను టీమ్‌కు పాజిటివ్‌గా, అగ్రెసివ్‌గా, ఎంటర్‌టైనింగ్ ఉండమనే చెబుతాను. ముఖాలపై చిరునవ్వుతో ఆడండి, అభిమానులను అలరించండి. టెస్ట్ క్రికెట్ అంటే కష్టపడి పని చేయడం, మీ నైపుణ్యాలను పరీక్షించుకోవడం, ఏకాగ్రతతో ఉండడం, ఓపికగా ఉండటం. కొన్నిసార్లు మీరు దూకుడుగా ఉండాలి. ఇతర సమయాల్లో మీరు డిఫెన్సివ్‌గా ఉండాలి. ఇతర జట్టు నుంచి ఒత్తిడిని తట్టుకోవాలి. మనం వీలైనంత నిలకడగా ఉండగలిగితే స్కోరుబోర్డు తనను తాను చూసుకుంటుంది. విజయాలను అందుకోగలం. పాక్ ఆటను దూరం నుంచి చూస్తే, వారు చాలా ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన ఆటగాళ్లని తెలుస్తుంది.
- ఇది ఒక గౌరవం - కానీ కొన్నిసార్లు, కామెంటేటర్లు వారి అసమానతల గురించి మాట్లాడటం వినే ఉంటారు. పాకిస్థాన్ మరింత స్థిరంగా ఉండగలదు. ఆటగాళ్లు తమను తాము ఎలా చూడాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నందున దీనిపై నేను ఆటగాళ్లతో మాట్లాడుతాను. నేను బ్యాటింగ్ కోణం నుంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లను చూస్తున్నాను. వారిలో చాలామంది చాలా మంచి స్ట్రోక్-మేకర్లు, చాలా సాంకేతికంగా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు. వేగంగా బౌలింగ్ చేసే, బంతిని స్వింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. బంతిని బాగా స్పిన్ చేసే స్పిన్నర్లు ఉన్నారు. ఈ అన్ని వనరులను కలిగి ఉన్న టెస్ట్ జట్టును పొందడం ఎక్సైటింగ్‌గా ఉంది. పాక్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండే అవకాశం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక గౌరవం.
- సెలెక్టర్‌గా అదనపు బాధ్యత - సెలక్షన్ కమిటీలో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. నా మొత్తం కోచింగ్ కెరీర్‌లో, నేను సెలెక్టర్‌గా ఒకసారి పని చేశాను. ఇదంతా స్పష్టత, కమ్యూనికేషన్‌కు సంబంధించినది. సెలెక్షన్ ప్యానెల్‌లోని ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. పాక్‌తో నేను ఉన్న సమయంలో, మేము మా అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తామని నేను ఆశిస్తున్నాను. మేము ఇక్కడ పోటీ పడటానికి కాదు, కచ్చితంగా గెలవడానికి ఉన్నాం. దాన్ని సులభతరం చేయడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను" అని పేర్కొన్నాడు గిల్లెస్పీ. కాగా, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన గిల్లెస్పీ 71 టెస్టుల్లో 259, 97 వన్డేల్లో 142 వికెట్లు తీశాడు.
పాక్ బోర్డు బిగ్ డెసిషన్ - ఛాంపియన్స్ ట్రోపీ కోసం ఆ ఈ 3 నగరాలు - ICC Champions Trophy 2024