T20 World Cup 2024 TeamIndia Vice Captain : జూన్ 1 నుంచి యూఎస్, వెస్టిండీస్‌లో టీ20 వరల్డ్ కప్ మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. త్వరలోనే బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్‌ను అనౌన్స్ చేయనుంది. అయితే మిగతా ప్లేయర్‌లు ఎవరనే అంశంపై ఇప్పటికే చాలా రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా క్రిక్‌బజ్ నివేదిక కూడా విడుదలైంది. భారత జట్టు వైస్ కెప్టెన్ ఎంపికపై క్రిక్‌బజ్ చేసిన విశ్లేషణ షాకింగ్‌గా మారింది.
- వైస్ కెప్టెన్ ఎవరు?
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కన్నా ముందు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రాబోయే T20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా మారవచ్చు. 2022 డిసెంబరులో రోడ్డు యాక్సిడెంట్‌లో గాయపడిన పంత్ చాలా కాలం క్రికెట్‌కి దూరమయ్యాడు. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2024లో అడుగుపెట్టిన పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
మరోవైపు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటర్, బౌలర్‌గా వెనకబడ్డాడు. ముంబయి జట్టును నడిపించే అతని సామర్థ్యంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2024 T20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మకు డిప్యూటీగా నిలిచే విషయానికి వస్తే, ప్రస్తుత ఫామ్‌లను పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ కంటే పంత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. మే 1న సమావేశం కానున్న జాతీయ సెలెక్టర్లు, పంత్‌ను భారత వైస్ కెప్టెన్‌గా నియమించాలని భావించవచ్చని స్పష్టం చేసింది. - 2022 జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో పంత్ భారతదేశానికి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అంతే కాదు టీ20 జట్టులో కీపర్ బ్యాటర్ పొజిషన్‌కి పంత్ మొదటి ఆప్షన్ అవుతాడని క్రిక్‌బజ్ పేర్కొంది.
- టీ20 జట్టులో ఎవరు ఉంటారు?
రెండో వికెట్ కీపర్ పొజిషన్‌కి సంజు శాంసన్, కేఎల్ రోహిల్ మధ్య పోటీ ఉంటుంది. ఇద్దరు క్రికెటర్లు తమ ఫ్రాంచైజీల తరఫున మంచి ప్రదర్శన కనబరిచారు. సెలెక్టర్ల ప్రాధాన్యతల మేరకు ఈ ఇద్దరిలో ఒకరు ఎంపిక కావచ్చు. ఇతర పొజిషన్‌లు పరిశీలిస్తే, టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉంటారు. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉంటారు. శివమ్ దూబే, రింకు సింగ్‌లో ఇద్దరూ లేదా ఒకరు ఉండవచ్చు. సంజూ శాంసన్ లేదా కేఎల్ రాహుల్‌లో ఒకరు ఎంపిక కావచ్చు.
కుల్దీప్ యాదవ్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులో కచ్చితంగా చోటు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆర్‌ఆర్ తరఫున రాణిస్తున్న చాహల్ మరోసారి అవకాశం కోల్పోవచ్చు. మరో స్పిన్నర్ పొజిషన్‌కి రవి బిష్ణోయ్ కంటే అక్షర్ పటేల్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని క్రిక్‌బజ్ తెలిపింది.
టీమ్ఇండియా వికెట్ కీపర్‌గా ఫస్ట్ ఛాయిస్ అతడే! - T20 World cup 2024
పాక్ బోర్డు బిగ్ డెసిషన్ - ఛాంపియన్స్ ట్రోపీ కోసం ఆ ఈ 3 నగరాలు - ICC Champions Trophy 2024