Swapnil Kusale Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్యం సాధించడంపై అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. దేశం కోసం స్వప్నిల్ పతకం గెలుస్తాడనే నమ్మకం తమకు ముందు నుంచి ఉందని తెలిపారు. ఆటపై స్వప్నిల్ దృష్టిని మరల్చకుండా ఉంచేందుకు అతడికి బుధవారం ఫోన్ కూడా చేయలేదని స్వప్నిల్ తండ్రి చెప్పారు.
'గత 10- 12 ఏళ్లుగా స్వప్నిల్ ఎక్కువగా ఇంటికి దూరంగా ఉన్నాడు. లక్ష్యసాధనపై దృష్టి పెట్టాడు. మాకు అభినందించడానికి శ్రేయాభిలాషులు కాల్స్ చేస్తున్నారు. స్వప్నిల్‌కు ఆటపై దృష్టి మళ్లకూడదని మ్యాచ్ ముందు రోజు( బుధవారం) కాల్ కూడా చేయలేదు' అని స్వప్నిల్ తండ్రి తెలిపారు. స్వప్నిల్ ప్రభుత్వ పాఠశాలలో చదివాడని, సాంగ్లీలో ఉన్నప్పుడు షూటింగ్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడని అతడి తల్లి వెల్లడించారు. తర్వాత షూటింగ్ శిక్షణ కోసం నాసిక్‌కు వెళ్లాడని చెప్పుకొచ్చారు. కాగా, స్వప్నిల్ స్వస్థలం మహారాష్ట్రలోని కొల్హపుర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న స్వప్నిల్ కుసాలేపై ప్రశంసలు కురుస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ తదితరులు స్వప్నిల్‌ను సోషల్ మీడియా ద్వారా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని ఆకాంక్షించారు.
🇮🇳🥉 𝗧𝗿𝗶𝗽𝗹𝗲 𝗕𝗿𝗼𝗻𝘇𝗲 𝗳𝗼𝗿 𝗜𝗻𝗱𝗶𝗮, 𝘁𝗿𝗶𝗽𝗹𝗲 𝘁𝗵𝗲 𝗷𝗼𝘆!
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 @sportwalkmedia 𝗳𝗼𝗿 𝗲𝘅𝘁𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗰𝗼𝘃𝗲𝗿𝗮𝗴𝗲 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗮𝘁𝗵𝗹𝗲𝘁𝗲𝘀 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗣𝗮𝗿𝗶𝘀 𝗢𝗹𝘆𝗺𝗽𝗶𝗰𝘀 𝟮𝟬𝟮𝟰!
📸 Pics belong to the respective owners… pic.twitter.com/mgy6wmLrLJ
'భవిష్యత్తులో మరిన్ని గెలవాలి'
'పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న స్వప్నిల్ కుసాలే కు హృదయపూర్వక అభినందనలు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా స్వప్నిల్ నిలిచాడు. ఒకే ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లలో భారత్ మూడు పతకాలు సాధించడం ఇదే తొలిసారి. రాబోయే ఈవెంట్‌లలో ఆడబోయే భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు. స్వప్నిల్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని కోరుకుంటున్నాను' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Heartiest congratulations to Swapnil Kusale for winning bronze medal at Paris Olympics! He has become the first Indian to win a medal in Men’s 50m rifle 3 positions category. It is for the first time that India has won three medals in shooting events in the same Olympic Games.…
— President of India (@rashtrapatibhvn) August 1, 2024
'అది అసాధారణ ప్రదర్శన'
పారిస్ ఒలింపిక్స్‌లో యువ షూటర్ స్వప్నిల్ కుసాలే అసాధారణ ప్రదర్శన చేశాడని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో కాంస్య సాధించినందుకు స్వప్నిల్‌కు అభినందనలు తెలియజేశారు. ఆటలో స్వప్నిల్ గొప్ప నైపుణ్యాలను కనబరిచారని కొనియాడారు. అలాగే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడని ప్రశంసించారు. స్వప్నిల్ పతకం సాధించడంతో దేశ పౌరులందరూ ఆనందంలో ఉన్నారని ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Exceptional performance by Swapnil Kusale! Congrats to him for winning the Bronze medal in the Men's 50m Rifle 3 Positions at the #ParisOlympics2024.
— Narendra Modi (@narendramodi) August 1, 2024
His performance is special because he’s shown great resilience and skills. He is also the first Indian athlete to win a medal in… pic.twitter.com/9zvCQBr29y
యువ షూటర్ స్వప్నిల్ దేశం గర్వించేలా చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. లక్షలాది మందికి యువతకు స్ఫూర్తినిచ్చే విజయాన్ని ఇచ్చారని కొనియాడారు. అలాగే కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ సైతం స్వప్నిల్ కు అభినందనలు తెలియజేశారు
భారత హాకీ జట్టుకు తొలి ఓటమి- హర్మన్‌సేనకు షాకిచ్చిన బెల్జియం!
భారత్ ఖాతాలో మూడో పతకం- కాంస్యం ముద్దాడిన స్వప్నిల్ - Paris Olympics 2024