ETV Bharat / sports

సూర్యకుమార్ సక్సెస్​ వెనక ఆమె - ఈ జంట లవ్ స్టోరీ 'అలామొదలైంది' - Surya Kumar Yadav Love Story

Surya Kumar Yadav Love Story : ఒకప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌ అంటే ఎవ్వరికీ తెలియదు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో రాణించినా టీమ్‌ ఇండియా తలుపులు తెరచుకోవడానికి పదేళ్లు పట్టింది. అలాంటి సూర్య ఇప్పుడు టీ20 ప్రపంచ క్రికెట్‌లో మోస్ట్‌ డేంజెరస్‌ బ్యాట్స్‌మెన్‌. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే 'స్కై' సక్సెస్‌ వెనుక ఓ బ్యూటిఫుల్‌ లేడీ ఉంది. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందన్న విషయం సూర్య జీవితంలో నిజమైంది. ఇంతకీ ఈ క్యూట్ కపుల్ లవ్​ స్టోరీ ఎలా మొదలైందంటే ?

Surya Kumar Yadav Love Story
Surya Kumar Yadav Love Story
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 6:04 PM IST

Updated : Mar 29, 2024, 7:40 PM IST

Surya Kumar Yadav Love Story : సినీ తారలదే కాదు క్రికెటర్ల పర్సనల్ విషయాల గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. తమ ఫేవరట్ స్టార్స్ ఫ్యామిలీ లైఫ్​ ఎలా ఉంది. వాళ్లు ఎటువంటి స్వీట్ మూమెంట్స్​ను ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటారు. ఇక తమ అభిమానుల కోసం ఆ స్టార్స్ కూడా అప్పుడప్పుడు తమ లైఫ్​లో జరిగే స్పెషల్ మూమెంట్స్​ను నెట్టింట షేర్ చేస్తుంటారు. తమ వెడ్డింగ్ ఫొటోస్​, యానివర్సరీ ఫొటోస్​, తమ పిల్లల ఫొటోస్ ఇలా కొన్నింటినీ అప్​లోడ్ చేస్తుంటారు. అంతే కాకుండా ఇంటర్వ్యూల్లోనూ తమ పర్సనల్​ లైఫ్​ గురించి క్రికెటర్లు కొన్ని సార్లు ఓపెనప్ అవుతుంటారు. అలా ఒకానొక సందర్భంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా తన లవ్​ లైఫ్​ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

ముంబయిలోని ఆర్‌.ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ కళాశాలలో ఈ జంట ప్రేమ ప్రయాణం మొదలైంది. సూర్య బీకామ్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా, దేవీషా అప్పుడే ఇంటర్‌ పూర్తి చేసి అదే కాలేజీలో జాయిన్ అయ్యింది. అప్పటికే దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు సూర్య.

ఇక ఫ్రెషర్స్‌ పార్టీలో దేవీషాను చూడటం, దేవిషా గ్రౌండ్‌లో సూర్యను చూడటం ఇదంతా సినిమాటిక్‌గా సాగిపోయాయి. అయితే కొద్ది రోజులకే ఒక మిత్రుడి ద్వారా దేవిషాకు మన సూర్యకుమార్ పరిచయమయ్యాడు. ఇక ఈ ఇద్దరూ కాలేజీ బయట కలుసుకోవడం, మాట్లాడుకోవడం లాంటివి ప్రారంభమయ్యాయి. ఈ జర్నీలో వాళ్లు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో చాటింగ్ ద్వారా మరింత దగ్గరయ్యారు. అలా నాలుగేళ్ల పాటు వీరి లవ్ స్టోరీ సాగింది.

ఇదిలా ఉండగా, దేవీషా మంచి డ్యాన్స్‌ కోచ్‌గా పేరు సంపాదించుకున్నారు. సూర్య కుమార్ కూడా నేషనల్ జట్టులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. 2012లో టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ 2015 వరకు అతడికి సరైన గుర్తింపు రాలేదు. అదే ఏడాది ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున ఆడిన ఈ స్టార్ క్రికెటర్ కేవలం 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో అప్పటి వరకు దేశవాళీ క్రికెట్​కే పరిమితమైన అతడి పాపులారిటీ ఒక్కసారిగా టీ20ల్లోనూ వచ్చేసింది.

అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఈ జంట తమ లైఫ్​లోని కీలక మూమెంట్​లోకి అడుగుపెట్టింది. 2016 మే 29న సూర్య, దేవీషా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ముంబయిలో స్థిరపడింది దేవీషా ఫ్యామిలీ. అందుకే 2016 జులై 7న ఈ కపుల్ సౌత్ ఇండియా సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట తమ స్పెషల్ మూమెంట్స్​ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యూట్ కపుల్ అనిపించుకుంటున్నారు.

అయితే తన లైఫ్‌లోని టఫ్ మూమెంట్స్​లో దేవీషా తనకు ఎప్పుడూ అండగా ఉండేదని సూర్య ఒకానొక సందర్భంలో చెప్పుకుని ఎమోషనలయ్యాడు. "మా పెళ్లి తర్వాత నేను ఒక రోజు దేవీషాతో నాకు క్రికెట్‌లో ఎదురైన కష్టాలు గురించి చెప్పుకున్నాను. నేను కేఎల్‌ రాహుల్, అక్షర్‌ పటేల్‌, బుమ్రాతో కలిసి ఆడాం. వీళ్లంతా టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు" అంటూ దేవీషాకు చెప్పాడు. అయితే దేవీషా అక్కడితో సూర్య మాటలకు అడ్డుపడి ' నువ్వు అన్ని ఆటంకాల గురించి మర్చిపోయి ముందు క్రికెట్ పై దృష్టిపెట్టు' అంటూ ఎంకరేజ్ చేసింది. ఆ మాటలు తన మనసులో బలంగా నాటుకుపోయాయని, అప్పుడే ప్రేమ అంటే ఏంటో తన వల్లే తెలిసిందని సూర్య చెబుతుంటాడు.

'మినీ వరల్డ్​కప్ మనదే! - ఆయన ఓదార్పు స్ఫూర్తినిచ్చింది'

Surya Kumar Yadav Birthday : బరిలోకి దిగితే దబిడి దిబిడే.. టీ20లో సూర్య నెం1 పొజిషన్​కు కారణం అదే!

Last Updated : Mar 29, 2024, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.