ETV Bharat / sports

5ఏళ్ల తర్వాత సన్​రైజర్స్ అలా- అంతా కమిన్స్ వల్లే! - IPL 2024

Sunrisers Hyderabad IPL 2024: సన్​రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత ఎడిషన్​లో అదరగొడుతోంది. లీగ్​ దశలో సూపర్ పెర్ఫార్మెన్స్​తో దర్జాగా టాప్​-2 స్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో సన్​రైజర్స్ దాదాపు 5 ఏళ్ల తర్వాత అరుదైన ఫీట్ సాధించింది.

Sunrisers Hyderabad
Sunrisers Hyderabad (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 9:17 AM IST

Updated : May 20, 2024, 11:32 AM IST

Sunrisers Hyderabad IPL 2024: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ దూకుడైన ఆటతో ప్లే ఆఫ్స్​కు చేరింది. ఈ సీజన్​లో బెదురు లేకుండా ఆడిన సన్​రైజర్స్ ప్లేఆఫ్స్​కు దూసుకుపోయి క్వాలిఫయర్- 1కు అర్హత సాధించింది. ఇక మే 21 అహ్మదాబాద్ వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో తలపడనుంది. ఈ క్రమంలో దాదాపు 5ఏళ్ల తర్వాత సన్​రైజర్స్ తొలిసారి క్వాలిఫయర్- 1 ఆడనుంది. సన్​రైజర్స్​ చివరిసారిగా 2018లో కేన్ విలియయమ్సన్​ కెప్టెన్సీలో క్వాలిఫయర్- 1 మ్యాచ్ ఆడింది.

కెప్టెన్ వల్లే!
అయితే సన్​రైజర్స్ ఈ సీజన్​ లీగ్ దశలో అనేక రికార్డులు కొల్లగొట్టింది. అవన్నీ ప్యాట్ కమిన్స్​ నాయతక్వం వల్లే సాధ్యమయ్యాయని సన్​రైజర్స్ ఫ్యాన్స్ అతడిపై ప్రసంశలు కురిపిస్తున్నారు. నిజానికి కమిన్స్​ కెప్టెన్సీలోనే సన్​రైజర్స్ అత్యంత పటిష్ఠంగా తయారైంది. ప్రత్యర్థి ఎవరైనా ఎదురు దాడికి దిగడమే తమ నైజం అన్నట్లుగా ఆడి మంచి ఫలితాలు సాధించింది. దీంతో జట్టుకు కెప్టెన్సీ వహించిన తొలి సీజన్​లోనే క్వాలిఫయర్ -1కు చేర్చిన ఘనత కమిన్స్​కు దక్కింది. ఇక నాకౌట్​లోనూ అదరగొట్టి జట్టుకు టైటిల్ అందిస్తాడని సన్​రైజర్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

వాళ్లిద్దరి తర్వాత: లీగ్ దశలో 14 మ్యాచ్​లు ఆడిన సన్​రైజర్స్ 8 నెగ్గి, ఐదింట్లో ఓడింది. అందులో గుజరాత్​తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో 17 పాయింట్లు (+0.414 రన్​రేట్​)తో టాప్ 2 బెర్త్ దక్కించుకుంది. ఇక వార్నర్​, విలియమ్సన్ తర్వాత సన్​రైజర్స్​ను ఇంక గొప్పగా నడిపించింది కమిన్సే. చెప్పాలంటే వాళ్లిద్దరి కన్నా టీమ్​పై కమిన్స్ కెప్టెన్సీ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక వార్నర్​ తర్వాత కమిన్సే జట్టుకు టైటిల్ అందిస్తాడని సన్​రైజర్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఆదివారం పంజాబ్​తో మ్యాచ్ తర్వాత కమిన్స్ మాట్లాడాడు. టీమ్​మేట్ అభిషేక్ శర్మ తనను భయపెట్టిన బ్యాటర్లలో ఒకడని అన్నాడు.'ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు. నేనెప్పుడూ అతడికి బౌలింగ్‌ చేయాలని కోరుకోను. స్వేచ్ఛగా ఆడే అతడికి ఎదురుగా బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. కేవలం పేసర్లనే కాకుండా స్పిన్‌నూ అలవోకగా ఆడేస్తాడు' అని అన్నాడు.

గవర్నమెంట్ స్కూల్​లో కమిన్స్- పిల్లలతో క్రికెట్- వీడియో చూశారా? - IPL 2024

ప్లేఆఫ్స్​కు అడుగు దూరంలో సన్​రైజర్స్- కమిన్స్ సేన టార్గెట్ అదే - IPL 2024

Last Updated : May 20, 2024, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.