Sunrisers Hyderabad New Captain : ఐపీఎల్ ఫ్రాంచైజీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్‌ను తమ జట్టు సారథిగా ప్రకటించింది. ఇటీవలే జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కమిన్స్‌ను ఆ ఫ్రాంచైజీ రూ.20.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.
ఇక కమిన్స్ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో తన ఆటతీరుతో సత్తా చాటాడు. రెండు ఓటములతో వెనుకబడినట్లు అనిపించిన ఆస్ట్రేలియా జట్టును వరుసగా ఏడు విజయాలతో ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు. అంతే కాకుండా ఫైనల్స్‌లోనూ జట్టుకు కీలకంగా మారి కప్‌ను ముద్దాడాడు.
మైదానంలోకి దిగాడంటే ఇక ఎలాంటి బ్యాటర్‌ను అయినా, ఏ ఫార్మాట్‌లో అయినా సరే చిత్తు చేస్తాడు. టీ20ల్లో 50 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో గతంలో ఆరు సీజన్లు ఆడిన ఈ స్టార్ ప్లేయర్ 45 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐదు మ్యాచులకు అందుబాటులో ఉన్న ప్యాట్ ఏడు వికెట్లతో రాణించాడు.
ఇక ఐపీఎల్ 2024 సీజన్ తొలి విడత షెడ్యూల్ మాత్రమే మేనేజ్మెంట్ అనౌన్స్ చేయలేదు. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తర్వాత దానికి అనుగుణంగా మిగతా మ్యాచ్‌లను షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. మార్చి 22న ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభం కానుండగా, మార్చి 23న సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను కోల్‌కతాతో ఆడనుంది.
2024 ఐపీఎల్ సీజన్లో హైదరబాద్ మ్యాచ్‌లు ఇవే :
మార్చి 23: కోల్‌కతా X హైదరాబాద్ (కోల్‌కతా)
మార్చి 27: హైదరాబాద్ X ముంబయి (హైదరాబాద్)
మార్చి 31: గుజరాత్ X హైదరాబాద్ (అహ్మదాబాద్)
ఏప్రిల్ 05: హైదరాబాద్ X చెన్నై (హైదరాబాద్)
సన్‌రైజర్స్ తుది జట్టు :
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్, ఆకాశ్ సింగ్, ఐదెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర యాదవ్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, సన్విర్ సింగ్, టి. నటరాజన్, సుబ్రమన్యన్, ఫజల్‌హక్ ఫరూఖి, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండె, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, జయ్‌దేవ్ ఉనద్కత్.
కమిన్స్ భార్యకు నెటిజన్ లవ్ ప్రపోజల్- ఇంట్రెస్టింగ్గా రిప్లై ఇచ్చిన క్రికెటర్