ETV Bharat / sports

2024 ప్లేఆఫ్స్ రేస్- 'సన్​రైజర్స్'​కు కీలక మ్యాచ్- లఖ్​నవూపై విజయం సాధిస్తేనే! - IPL 2024 - IPL 2024

Sunrisers Hyderabad IPL 2024: ఉప్పల్ వేదికగా సన్​రైజర్స్ బుధవారం (మే 8) లఖ్​నవూతో తలపడనుంది. ప్రస్తుత సీజన్​లో ప్లేఆఫ్స్​ రేస్​లో ముందడుగు వేయాలంటే సన్​రైజర్స్​కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

Sunrisers IPL 2024
Sunrisers IPL 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 12:24 PM IST

Updated : May 8, 2024, 12:58 PM IST

Sunrisers Hyderabad IPL 2024: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్​ హాఫ్​లో అదరగొట్టినప్పటికీ సెకండ్ హాఫ్​లో కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. తొలి 7 మ్యాచ్​ల్లో ఐదింట్లో నెగ్గిన సన్​రైజర్స్​ తర్వాత ఆడిన నాలుగింట్లో ఒకే విజయం నమోదు చేసింది. అది కూడా 1 పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్​పై నెగ్గింది. ప్రస్తుతం 11 మ్యాచ్​లు ఆడిన సన్​రైజర్స్ 6 విజయాలతో నాలుగో స్థానం (12 పాయింట్లు)లో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్​కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్​ల్లో కనీసం రెండింట్లో విజయం సాధించడం తప్పనిసరి.

అయితే అఫీషియల్​గా ఏ జట్టు కూడా ప్లేఆఫ్స్​కు వెళ్లకపోయినా, టాప్​లో ఉన్న కోల్​కతా, రాజస్థాన్​కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం సన్​రైజర్స్​తో పాటు, చెన్నై సూపర్ కింగ్ (12 పాయింట్లు), లఖ్​నవూ సూపర్ జెయింట్స్ (12 పాయింట్లు), దిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం (మే 8) సన్​రైజర్స్ సొంతగడ్డపై లఖ్​నవూతో పోటీ పడనుంది.

ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్​ నెగ్గితే ప్లేఆఫ్స్​ రేస్​లో ముందడుగు వేయడమే కాకుండా లఖ్​నవూ ఛాన్స్​లు దెబ్బతీసినట్లవుతుంది. దీంతో సన్​రైజర్స్​కు లైన్ క్లియర్ అవుతుంది. ఒకవేళ లఖ్​నవూతో మ్యాచ్​లో ఓడితే చివరి రెండు మ్యాచ్​ (గుజరాత్ టైటాన్స్​, పంజాబ్ కింగ్)ల్లో కచ్చితంగా నెగ్గాలి. లేకపోతే ఇతర జట్ల గెలుపోటములపై ఆధార పడాల్సి వస్తుంది. పైగా సన్​రైజర్స్​ నెట్ రన్​రేట్​ (-0.065) కూడా మైనస్​లో ఉంది.​ దీంతో సన్​రైజర్స్ చివరి మ్యాచ్​ల్లో కాస్త ఒత్తిడిలో పడే ప్రమాదం కాడా ఉంది. అందుకే సన్​రైజర్స్​కు ఈ మ్యాచ్​ అత్యంత కీలకం కానుంది.

లఖ్​నవూతో మ్యాచ్​ తుది జట్టు (అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సన్​ /గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్/జయ్‌దేవ్ ఉనాద్కత్.

సన్‌రైజర్స్‌పై సూర్యప్రతాపం - ముంబయి ఘనవిజయం - IPL 2024

200 ప్లస్ స్కోర్ - ఛేజింగ్​లో విఫలం - హైదరాబాద్​కు ఏమైంది? - IPL 2024

Last Updated : May 8, 2024, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.