ETV Bharat / sports

లక్ష్యసేన్ పెర్ఫామెన్స్​పై దిగ్గజ క్రికెటర్ ఫైర్​ - రోహిత్ శర్మ స్టైల్​లో కామెంట్స్​ - Sunil Gavaskar Paris Olympics 2024 - SUNIL GAVASKAR PARIS OLYMPICS 2024

Sunil Gavaskar Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పెర్ఫామెన్స్ గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో పాటు తాజాగా బ్యాడ్మింటన్ కోచ్ ప్రకాశ్ పదుకుణె కామెంట్స్​కు మద్దతు తెలిపారు.

Sunil Gavaskar Paris Olympics 2024
Lakshyasen, Sunil Gavaskar (Associated Press, ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 13, 2024, 4:12 PM IST

Sunil Gavaskar Paris Olympics 2024 : ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్​లో భారత షట్లర్ల ఆటతీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. ఈ విశ్వక్రీడల్లో మన ప్లేయర్లు ఒకట్రెండు పతకాలైనా సాధిస్తారని అనుకుంటే చివరకు ఒక్క పతకం కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోచ్ ప్రకాశ్ పదుకుణె చేసిన కామెంట్స్​కు ఆయన సపోర్ట్​ తెలిపారు. ప్రకాశ్ అన్న మాటల్లో తప్పు లేదని సునీల్ అన్నారు.

"ప్రకాశ్‌ పదుకొణెను నేను 2017-18 మధ్య ఓ సారి కలిశాం. అప్పుడు ఆయన యంగ్ ప్లేయర్ లక్ష్యసేన్ గురించి చెప్పారు. ఇప్పుడు అతడికి మెంటార్‌గా ఉన్నారు. లక్ష్యసేన్‌ పురోగతిని దగ్గర నుంచి గమనించారు. అయితే ఒలింపిక్స్‌ పతకాన్ని ముద్దాడాలన్న కల కేవలం లక్ష్యసేన్​ది మాత్రమే కాదు ఎంతోమంది బ్యాడ్మింటన్‌ అభిమానులది కూడా. సెమీస్​లో 20-17తో లక్ష్యసేన్​ మంచి ఆధిక్యంలో కనిపించాడు. దీంతో సులభంగా గెలుస్తాడని అనుకున్నాను. కానీ అనూహ్యంగా ఓడిపోయాడు. కాంస్య పతక మ్యాచ్‌లోనూ అదే జరిగింది. మొదటి గేమ్‌లో సునాయసంగా విజయం సాధించనట్లైనా గెలుస్తాడనుకుంటే ఆఖరికీ అతడు నిరాశపరిచాడు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌, భారత ప్రభుత్వం తమకు వీలైనంత వరకూ ప్లేయర్లకు అన్ని వసతులు సమకూర్చుతూ వస్తోంది. అన్నీ ఇస్తున్నప్పుడు అథ్లెట్లు కూడా తమ గేమ్​ పట్ల బాధ్యత తీసుకోవాలి. అతను ఎందు కోసం ఒలింపిక్స్‌కు వెళ్లాడు? ఏం సాధించడానికి అతడ్ని పంపించారు? అనేది తెలుసుకుని అతడు ఆడాలి. వాస్తవానికి పారిస్​కు అతడు పతకాలు తేవడానికే కదా వెళ్లింది. అక్కడ తిరిగి ఎంజాయ్ చేయడానికి కాదుగా. టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ స్టైల్​లో చెప్పాలంటే లక్ష్యసేన్‌ కోర్టులో చక్కర్లు కొడుతూ ప్రత్యర్థికి మెడల్ ఇచ్చేశాడు" అంటూ సునీల్ గావస్కర్‌ యంగ్ ప్లేయర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, సెమీస్, కాంస్య పతక మ్యాచ్‌ల్లో లక్ష్యసేన్ తన కాన్సన్​ట్రేషన్​ను కోల్పోయినట్లు వీక్షకులకు స్పష్టంగా తెలిసిందని గావస్కర్‌ పేర్కొన్నారు. ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్లను చూసి నేర్చుకోవాలని, దీని గురించి ఏ కోచ్‌ కూడా దగ్గరుండి చెప్పించరని గావస్కర్ అన్నారు.

ప్రత్యర్థులుగా సచిన్, సునీల్ గవాస్కర్ - ఈ మ్యాచ్‌ ఎప్పుడు జరిగిందంటే? - Sachin Tendulkar VS Sunil Gavaskar

బ్యాడ్మింటన్​లో భారత్​కు నిరాశ- 12ఏళ్లలో ఇదే తొలిసారి! - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.