Subhman gill vs spin : ప్రస్తుత భారత క్రికెట్లో తన ఆటతో అద్భత ఆటగాడిగా కితాబందుకున్న యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్. కోహ్లీ తర్వాత నెక్ట్స్ కాబోయే సూపర్ స్టార్ ఇతడే అనేంతగా ప్రశంసలను దక్కించుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ పరుగుల వరద పారించి మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. అయితే ఇప్పుడు ఇంత గొప్ప ప్రదర్శన చేసి గిల్ పెర్ఫామెన్స్ ఉన్నట్లుండి పడిపోయింది. కొన్ని నెలలుగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు.
ముఖ్యంగా ఓపెనింగ్ నుంచి మూడో స్థానానికి మారాక శుభమన్ గిల్ ఆట మరింత నిరాశకు గురి చేస్తోంది. నెమ్మదిగా ఉండే, ముఖ్యంగా బంతి బాగా టర్న్ అయ్యే వికెట్లపై ఆడుతున్నప్పుడు తడబడుతున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజులో నిలవలేకపోతున్నాడు.
రీసెంట్గా హైదరాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా అనూహ్య పరాజయం పొందింది. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ మరీ పేలవంగా ఆడి డకౌట్ అవ్వడం వల్ల అతడిపై మరింత ఎఫెక్ట్ చూపింది. స్వతహాగా ఓపెనర్‌గా ఆడే గిల్ - గతేడాది పుజారా టీమ్‌లో చోటు కోల్పోయినప్పుడు నుంచి మూడో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.
అయితే ఓపెనింగ్‌లో కంఫర్ట్‌బుల్‌గా ఆడుతున్నట్టు కనిపించే గిల్ ఈ మూడో స్థానంలో ఆడలేకపోతున్నట్లు క్లారిటీగా అర్థమవుతోంది. మొదట పేసర్లను ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకున్నాక స్పిన్నర్లను ఎదుర్కోవడంలో గిల్‌కు కాస్త సౌలభ్యం ఉండేది. కానీ ఇప్పుడు మూడో స్థానంలో డైరెక్ట్‌గా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నాడు.
మూడో స్థానంలోకి బరిలోకి దిగడం మొదలుపెట్టాక ఐదు టెస్టుల్లో కేవలం 147 పరుగులే చేశాడు. ఒక్కసారీ కూడా హాఫ్ సెంచరీ బాదలేదు. అత్యధికంగా 36 పరుగులే చేశాడు. దీంతో స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగిన హైదరాబాద్ ఉప్పల్ టెస్ట్ గిల్‌కు సవాల్‌గా మారింది.
తొలి ఇన్నింగ్స్‌లో మరీ నెమ్మదిగా ఆడుతూ 23 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయితే రెండో బంతికే వికెట్ పోగొట్టుకున్నాడు. రెండుసార్లూ స్పిన్నర్ హార్ట్‌లీనే క్యాచౌట్‌తో పెవిలియన్‌కు పంపాడు. కాబట్టి గిల్ మూడో స్థానంలో తన టెక్నిక్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెండో టెస్టుకు వేదికైన విశాఖపట్నంలో కూడా పిచ్ స్పిన్‌కే అనుకూలిస్తుందని అంటున్నారు. కాబట్టి ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లను ఎదుర్కోవడం గిల్‌కు మరోసారి పరీక్ష లాంటిదే. అతడు నెట్స్‌లో టెక్నిక్‌తో బాగా ప్రాక్టీస్ చేసి స్పిన్‌ను బాగా ఎదుర్కొంటూనే ఇకపై జట్టులో చోటు ఉండే అవకాశం ఉంటుంది.
-
🇮🇳📈🔝 pic.twitter.com/AAZxc5PI5P
— Shubman Gill (@ShubmanGill) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🇮🇳📈🔝 pic.twitter.com/AAZxc5PI5P
— Shubman Gill (@ShubmanGill) November 5, 2023🇮🇳📈🔝 pic.twitter.com/AAZxc5PI5P
— Shubman Gill (@ShubmanGill) November 5, 2023
టీమ్‌ఇండియా క్రికెటర్‌కు తీవ్ర అస్వస్థత - హెల్త్ ఎలా ఉందంటే?