TeamIndia Head coach Stephen Fleming : రాహుల్ ద్రవిడ్ తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ ఎవరు? అనే అంశంపై చాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. సీఎస్కే కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇండియా కోచ్ అయితే బావుంటుందని బీసీసీఐ భావించినట్లు, అతన్ని ఒప్పించే బాధ్యత ధోనీకి అప్పగించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఫ్లెమింగ్ తనతో ఏం చెప్పాడో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.
తాజాగా CSK పోస్ట్ చేసిన వీడియోలో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ - "ఇండియన్ కోచ్ పదవికి ఫ్లెమింగ్ అప్లై చేస్తున్నాడా? అని నన్ను చాలా మంది జర్నలిస్టులు ఫోన్ చేసి అడిగారు. నేను సరదగానే ఇండియన్ కోచింగ్ అసైన్‌మెంట్‌కు అప్లై చేశావా? అని ప్లెమింగ్‌ను అడిగాను. అతను నవ్వుతూ ‘డూ యూ వాంట్ మీ టూ’ అనడిగాడు. అయినప్పటికీ, ఫ్లెమింగ్‌కు ఫుల్ టైమ్ కోచింగ్ రోల్ సూట్ అవుతుందని నేను భావించడం లేదు. అతను తక్కువ కాలం పని చేయడానికి ఇష్టపడుతాడు. సంవత్సరానికి తొమ్మిది నుంచి పది నెలల పాటు కమిట్ కావడానికి ఆసక్తి చూపడు. అంతకు మించి నేను అతనితో ఏదీ డిస్కస్ చేయలేదు" అని చెప్పారు.
కాగా, బీసీసీఐ మే 13న హెడ్ కోచ్ రోల్‌కి అప్లికేషన్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ గడువు మే 27తో ముగియనుంది. ఫారిన్ కోచ్‌ను ఎంపిక చేసుకునేందుకు బోర్డు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. కొత్త కోచ్ పదవీకాలం 2027 డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. ఈ టెన్యూర్‌లో కీలక 2027 వన్డే వరల్డ్ కప్ కూడా జరుగుతుంది.
అయితే క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించే ముందు స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే సీఎస్కే హెడ్ కోచ్‌గా అతడు చెన్నైని సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిపాడు. మేజర్ లీగ్ క్రికెట్ (USA)లో టెక్సాస్ సూపర్ కింగ్స్, SA20 (దక్షిణాఫ్రికా)లో జోబర్గ్ సూపర్ కింగ్స్, ది హండ్రెడ్‌లో సదరన్ బ్రేవ్ టీమ్‌కు కూడా పని చేస్తున్నాడు.
- ఆఫర్ రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్!
ఐసీసీ రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ - "నేను ఇండియా కోచ్‌గా పని చేయనున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. ఐపీఎల్ సమయంలో నన్ను సంప్రదించారు. నేను జాతీయ జట్టుకు సీనియర్ కోచ్‌గా ఉండటం నాకు ఇష్టమే. కానీ నా లైఫ్‌లో ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఫ్యామిలీతో సమయం గడపాలి అనుకుంటున్నాను. ఇండియాకు హెడ్ కోచ్‌గా పని చేస్తే, మళ్లీ ఐపీఎల్‌లో పాల్గొనలేం. ఆ ఆప్షన్ కూడా పోతుంది. అలాగే, ప్రధాన కోచ్ అంటే సంవత్సరంలో 10 లేదా 11 నెలలు పని చేయాలి. ప్రస్తుతం నా లైఫ్‌స్టైల్‌కు నిజంగా సరిపోదు." అని చెప్పాడు.
'విరాట్ ఆర్సీబీని వదిలెయ్, నీకు అదే బెటర్- వాళ్లు అలా వెళ్లినవారే'! - IPL 2024
కోహ్లీపై విజయ్ మాల్యా కామెంట్స్- ఆటాడేసుకున్న ఫ్యాన్స్! - Virat Vijay Mallya