Hardik Pandya Natasha Divorce: టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య- నటాషా స్టాంకోవిచ్ విడాకుల ప్రచారానికి తెర పడింది. వారిద్దరూ విడిపోతున్నట్లు హార్దిక్ పాండ్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తమ 4ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. ఇది తనకు కఠినమైన సమయం అని చెప్పుకొచ్చిన హార్దిక్, అభిమానుల మద్దతు తనపై ఉండాలని హార్దిక్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ రాసుకొచ్చాడు.
'4 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేం కలిసి ఉండేందుకు మా వంతుగా అన్ని విధాలుగా ప్రయత్నించాం. ఈ నిర్ణయం మా ఇద్దరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నాం. మా అనుబంధాన్ని తెంచుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నాం. కుమారుడు అగస్త్య బాధ్యతను తల్లిదండ్రులుగా ఇద్దరం చూసుకుంటాం. ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం' అని సోషల్ మీడియాలో హార్దిక్, నటాషా పోస్ట్ పెట్టారు.
కాగా, 2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో పాండ్య, సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి డిఫరెంట్‌గా ప్రపోజ్ చేశాడు. తర్వాత వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత హార్దిక్- నటాషా ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భిణి అని హార్దిక్ సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అయితే అప్పటికే వాళ్లకు పెళ్లైపోయింది. ఇక అదే ఏడాది జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ, గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్ పద్ధతుల్లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.
ఇక రీసెంట్గా నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకొని ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
డివోర్స్ రూమర్స్ నడుమ కుమారుడితో పయనం - హార్దిక్ సతీమణి స్టోరీ అందుకోసమేనా? - Hardik Pandya Wife