ETV Bharat / sports

లంక క్రికెట్‌ బోర్డుపై నిషేధం ఎత్తివేత - లంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్

Sri Lanka Cricket suspension lifted : శ్రీలంక క్రికెట్‌బోర్డుపై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎత్తివేసింది. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేయడం వల్ల సదరు క్రికెట్‌ బోర్డును ఆ దేశ ప్రభుత్వం గత నవంబర్‌లో రద్దు చేసింది. ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ లంక సభ్యత్వంపై ఐసీసీ సస్పెన్షన్‌ విధించిన విషయం తెలిసిందే.

లంక క్రికెట్‌ బోర్డుపై నిషేధం ఎత్తివేత
లంక క్రికెట్‌ బోర్డుపై నిషేధం ఎత్తివేత
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 9:03 PM IST

Updated : Jan 28, 2024, 10:15 PM IST

Sri Lanka Cricket suspension lifted : శ్రీలంక క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) శుభవార్త చెప్పింది. లంక క్రికెట్‌ బోర్డుపై విధించిన నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఆదివారం తెలిపింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని చెప్పిన ఐసీసీ మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్‌(SLC) స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందంటూ గతేడాది నవంబర్‌లో లంకపై నిషేధం విధించింది. అయితే, సస్పెన్షన్‌ విధించినప్పటి నుంచి పరిస్థితులను పర్యవేక్షించింది ఐసీసీ. అప్పటి నుంచి బోర్డు తీసుకుంటున్న చర్యలపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడల మంత్రి హరిన్‌ ఫెర్నాండో ఎక్స్‌ వేదికగా తెలిపారు.

ఇదీ జరిగింది : గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో(ODI World Cup sri lanka) లంక దారుణ ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్‌ఎల్‌సీ బోర్డు సభ్యులపై వేటు వేసింది. క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ(ICC Sri lanka ban) అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఎస్‌ఎల్‌సీపై నిషేధం విధించింది. ఈ నిషేధం వల్ల లంక ఈ ఏడాది ఐసీసీ అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ ఆతిథ్య హక్కులను కూడా కోల్పోయింది. లేదంటే ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్​ టోర్నీ లంకలోనే జరిగేది.

అయితే ఐసీసీ విధించిన నిషేధాన్ని లంక బోర్డు వ్యతిరేకించింది. దీనిపై నవంబర్‌ 21న అప్పీల్‌ చేసుకుంది. ఈ క్రమంలో ఐసీసీ సీఈవో జెఫ్‌ అల్లార్డిస్‌ - లంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌ సింఘేతో పాటు లంక క్రీడల మంత్రి హరిన్‌ ఫెర్నాండోతో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం బోర్డు చర్యల పట్ల సంతృప్తి చెందిన ఐసీసీ, తాజాగా నిషేధాన్ని ఎత్తివేస్తూ లంకకు గుడ్ న్యూస్ చెప్పింది.

  • The International Cricket Council (ICC) Board has today lifted the suspension of Sri Lanka Cricket (SLC) with immediate effect.

    SLC was suspended in November for being in serious breach of its obligations as an ICC Member...The Board have been monitoring the situation since the… pic.twitter.com/CFjXVy6LkO

    — ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అండర్‌19 ప్రపంచకప్‌ - భారత్‌ ఘన విజయం

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విజేతగా సినర్‌

Last Updated : Jan 28, 2024, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.