ETV Bharat / sports

సన్​రైజర్స్ x దిల్లీ- ఆరెంజ్ కాదు డేంజర్ ఆర్మీ- దెబ్బకు రికార్డులు బ్రేక్! - IPL 2024 - IPL 2024

SRH vs DC IPL 2024: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ మరోసారి విధ్వంసం సృష్టించింది. దిల్లీ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్ దెబ్బకు పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. అవేటంటే?

SRH vs DC IPL 2024
SRH vs DC IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 9:36 AM IST

SRH vs DC IPL 2024: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ అదరగొడుతోంది. ఈ సీజన్​లో ఐదో విజయం నమోదు చేసింది. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో విధ్వంసం సృష్టిస్తూ, దిల్లీని తమ సొంత గడ్డపై మట్టికరిపించింది. సన్​రైజర్స్​ బ్యాటర్లు మరోసారి చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి ముందు 267 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం దిల్లీ భారీ టార్గెట్​ను ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్​ను ఘనంగానే ఆరంభించినా, క్రమంగా వికెట్లు కోల్పోయింది. దీంతో పట్టు బిగించిన సన్​రైజర్స్ దిల్లీని 199 పరుగులకే ఆలౌట్ చేసి 67 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ క్రమంలో పలు రికార్డును నమోదు చేసింది.

  • ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్​ 266 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇది ఐపీఎల్​ హిస్టరీలో ఇది నాలుగో హైయ్యెస్ట్​ స్కోర్. టాప్​ స్కోర్ రెండు స్కోర్లు కూడా హైదరాబాద్​వే. ఇదే సీజన్​లో 287 (ఆర్సీబీపై), 277 (ముంబయిపై) పరుగులు చేసింది. ఇక ఈ లిస్ట్​లో టాప్- 5లో మూడు సన్​రైజర్స్​వే కావడం గమనార్హం.
  • ఈ మ్యాచ్​తో పేసర్ భువనేశ్వర్ కూమార్ సన్​రైజర్స్​ తరఫున 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సన్​రైజర్స్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్​గా నిలిచాడు. కాగా, ఐపీఎల్​లో భువీ ఇప్పటివరకు 174 వికెట్లు పడగొట్టాడు.
  • సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్​లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో సన్​రైజర్స్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు (16 బంతుల్లో) అభిషేక్ శర్మను హెడ్ సమం చేశాడు.
  • ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ 22 సిక్స్​లు బాదింది. ఈ సీజన్​లో 22 సిక్స్​లు బాదడం సన్​రైజర్స్​కు ఇది రెండోసారి. ఐపీఎల్​లో ఓ ఇన్నింగ్స్​లో బాదిన అత్యధిక సిక్స్​లు ఇవే.
  • సన్​రైజర్స్ పవర్​ప్లేలో 24 (ఫోర్లు, సిక్స్​లు కలిపి) బౌండరీలు సాధించింది. ఇంటర్నేషనల్ టీ20లో తొలి 6 ఓవర్లలో అత్యధిక బౌండరీలు బాదిన సందర్భం ఇదే. గత రికార్డు (శ్రీలంక 2014లో ససెక్స్​) బద్దలైంది.
  • సన్​రైజర్స్ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు బాదింది. ఐపీఎల్​తోపాటు పురుషుల టీ20ల్లో పవర్​ ప్లే లో టాప్ స్కోర్ ఇదే. ఇదివరకూ ఈ రికార్డు నాటింగ్‌హమ్‌షైర్‌ (2017లో 106 పరుగులు) పేరిట ఉండేది.
  • ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ 5 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటింది. పురుషుల టీ20లో వేగంగా 100+ స్కోర్ సాధించిన జట్టుగా సన్​రైజర్స్ రికార్డు కొట్టింది. ఇదివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా (2023లో వెస్టిండీస్​పై 5.3 ఓవర్లలో) ఉండేది.
  • 10 ఓవర్లకు సన్​రైజర్స్ స్కోర్ 158-4. ఐపీఎల్​లో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ కూడా ఇదే. ఈ రికార్డు ఇదివరకు సన్​రైజర్స్ (2024లో ముంబయిపై 148 పరుగులు) పేరిటే ఉండగా తాజాగా తామే బద్దలుకొట్టారు.
  • దిల్లీ యంగ్ బ్యాటర్ ఫ్రేజర్ ఛేదనలో దూకుడుగా ఆడి 15 బంతుల్లోనే బాఫ్ సెంచరీ కొట్టాడు. దిల్లీ తరఫున ఇదే వేగవంతమైన అర్ధ శతకం. ఇదివరకు క్రిస్ మోరిస్ (17 బంతుల్లో) పేరిట ఉండేది. ఇక ఓవరాల్​గా ఐపీఎల్​లో ఇది మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. యశస్వీ జైస్వాల్ (13 బంతుల్లో), కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో) ముందున్నారు. కాగా, 2024 సీజన్​లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.

హైదరాబాద్‌ ఓపెనర్ల విధ్వంసం - ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌ - IPL 2024

అదరగొట్టేసిన సన్​రైజర్స్​ - వరుసగా నాలుగో విజయం - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.