ETV Bharat / sports

IPLలో స్పెషల్ జెర్సీలు- ఒక్కో జట్టుది ఒక్కో స్టోరీ- మీకు తెలుసా? - Special Jersey In IPL - SPECIAL JERSEY IN IPL

Special Jersey In IPL: 2024ఐపీఎల్​లో ఈడెన్ గార్డెన్స్​ వేదికగా లఖ్​నవూ ఆదివారం కోల్​కతాతో తలపడుతోంది. ఈ మ్యాచ్​లో లఖ్​నవూ ప్లేయర్లు తమ రెగ్యులర్ జెర్సీతో కాకుండా స్పెషల్‌ జెర్సీలో బరిలో దిగారు. ఇలా ఐపీఎల్​లో ఏయే టీమ్​లు స్పెషల్ జెర్సీలు ధరిస్తున్నాయి? వాటి వెనుక కథంటో మీకు తెలుసా?

Special Jersey In IPL
Special Jersey In IPL
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 5:19 PM IST

Special Jersey In IPL: ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంచైజీలు తమతమ రెగ్యులర్ జెర్సీల్లో కాకుండా స్పెషల్ జెర్సీలు ధరించి ప్రతి సీజన్​లో ఓ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇలా పలు ఫ్రాంచైజీలు గత కొన్ని సీజన్లుగా ఈ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాయి. అయితే సమాజంలోని పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ స్పెషల్ జెర్సీల ముఖ్య ఉద్దేశం అని ఆ ఫ్రాంచైజీలు చెబుతుంటాయి. అలా 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేసిన ఈ ప్రయోగాన్ని అనంతరం చాలా టీమ్‌లు ఫాలో అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో రీసెంట్​గా రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీతో మ్యాచ్​లో ఫుల్​ పింక్ కలర్ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. తాజాగా లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్లు ఆదివారం కోల్​కతా నైట్​రైడర్స్​ మ్యాచ్​లోనూ స్పెషల్ జెర్సీ ధరించారు. ఇలా ఇప్పటి వరకు చాలా ఫ్రాంచైజీలు కొన్ని ప్రత్యేక కారణాలతో స్పెషల్‌ జెర్సీలు ధరించాయి. మరి ఐపీఎల్​లో ఏయే టీమ్​ స్పెషల్ జెర్సీలు ధరిస్తున్నాయి? ఆ స్పెషల్ జెర్సీల వెనుక కథేంటో మీకు తెలుసా?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రత్యామ్నాయ కిట్‌లతో ప్రయోగాలు చేయడంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఈ సంప్రదాయాన్ని 2011లో ప్రారంభించారు. 'గో గ్రీన్‌' క్యాంపెయిన్‌కి సపోర్ట్‌గా ఈ జెర్సీ ధరించారు. బెంగళూరు గ్రీన్ కిట్‌ను చాలాసార్లు మార్చినా 2023లో గ్రీన్‌, బ్లాక్‌ కాంబినేషన్‌ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. ఐపీఎల్ 2021లో, RCB COVID-19 వారియర్స్‌కి నివాళిగా బ్లూ కలర్‌ కిట్‌ను ధరించింది.

లఖ్​నవూ సూపర్ జెయింట్స్: లఖ్​నవూ సూపర్ జెయింట్స్ (LSG) 2023లో కోల్‌కతా ఫుట్‌బాల్ దిగ్గజం మోహన్ బగాన్ స్ఫూర్తితో గ్రీన్‌, మెరూన్ జెర్సీని ధరించింది. ఈ రోజు (14-04-2024) కూడా కేకేఆర్​తో మ్యాచ్​లో అదే జెర్సీతో బరిలో దిగింది. గ్రీన్‌, మెరూన్‌ కాంబినేషన్‌ చాలా మందికి నచ్చింది. కోల్‌కతాకు చెందిన మోహన్‌ బగాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ట్రిబ్యూట్‌ ఇచ్చేలా గ్రీన్‌, మెరూన్‌ కలర్‌ జెర్సీలో ఆటగాళ్లు బరిలోకి దిగారు.

దిల్లీ క్యాపిటల్స్: దిల్లీ క్యాపిటల్స్‌ పేరు 2008 నుంచి 2018 వరకు దిల్లీ డేర్‌డెవిల్స్. 2015 సీజన్‌లో డేర్‌డెవిల్స్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి లావెండర్ కలర్‌ ధరించింది. 2019లో ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుంది. 2020 నుంచి ప్రతి సంవత్సరం లీగ్ గేమ్‌లలో ఓ మ్యాచ్‌కి రెయిన్‌బో థీమ్‌ జెర్సీని ధరిస్తోంది. JSW పెయింట్స్ బ్రాండ్ కోసం ఈ కలర్‌ జెర్సీని వినియోగిస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్: IPLలో మరో కొత్త జట్టు, గుజరాత్ టైటాన్స్ (GT), బ్లూ కలర్‌ జెర్సీని సెలక్ట్‌ చేసుకుంది. అయితే 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి హోమ్ గేమ్‌ కోసం లావెండర్ కిట్‌ను ఎంచుకుంది. క్యాన్సర్ రోగులు, ప్రాణాలతో బయటపడినవారు, వారి కుటుంబాలకు మద్దతుగా ఈ జెర్సీని ధరించింది.

రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ (RR) 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జెర్సీలో పింక్‌ కలర్‌ యాడ్‌ చేసింది. 2019 నుంచి వారి కిట్‌లో పింక్‌ సాధారణ భాగంగా మారింది. 2024లో ఒక అడుగు ముందుకు వేసి, 'ఔరత్ హై తో భారత్ హై' ప్రచారం కోసం ఆల్-పింక్ కిట్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా, రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సంఘీభావం తెలిపేందుకు రాయల్స్ ఈ ప్రత్యేక జెర్సీని ధరించింది. గేమ్‌లో కొట్టే ప్రతి సిక్స్‌కి, గ్రామాల్లో ఆరు సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

ఒకే ఫ్రేమ్​లో సచిన్ ధోనీ రోహిత్ - ఫ్యాన్స్​లో డబుల్ జోష్​! - IPL 2024

కోహ్లీకి మరో అరుదైన గౌరవం - అక్కడ మైనపు విగ్రహం ఏర్పాటు - Virat Kohli statue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.