ETV Bharat / sports

ఆ రూమర్స్​లో నిజం లేదు - అండర్‌-19 వరల్డ్‌ కప్​నకు భారత్ ఆతిథ్యం ఎందుకు ఇవ్వట్లేదంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 7:59 PM IST

Sourav Ganguly Ind Vs Aus Final : అండర్ 19 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం ఫైనల్‌ జరగనున్న వేళ భారత్ మాజీ క్రికెటర్ సౌరభ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐపై వచ్చిన విమర్శలను అతడు కొట్టిపడేశాడు.

Sourav Ganguly Ind Vs Aus Final
Sourav Ganguly Ind Vs Aus Final

Sourav Ganguly Ind Vs Aus Final : 1988లో ప్రారంభమైన అండర్ -19 వరల్డ్‌ కప్‌ ఇప్పుడు 15వ ఎడిషన్‌ ఫైనల్‌కు చేరుకుంది. సౌఫ్రికాలోని బెనోని వేదికగా ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఈ టోర్నీకి ఒక్కసారి కూడా మన భారత్ ఆతిథ్యం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తే లాభదాయకంగా ఉండదనే ఉద్దేశంతోనే బీసీసీఐ దీన్ని నిర్వహించేందుకు ఆసక్తి చూపించడం లేదన్న విమర్శలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటిపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ స్పందించాడు.

"అండర్-19 వరల్డ్​ కప్​ను ఇక్కడ నిర్వహించకపోవడానికి ప్రత్యేకంగా ఎటువంటి కారణాలు లేవు. ఇతర మెగా టోర్నీలు ఇక్కడ చాలానే జరిగాయి. నాలుగేళ్లకొకసారి వచ్చే సీనియర్‌ వరల్డ్‌ కప్‌ల కంటే, అండర్-19 కప్‌ జరగకపోతే నష్టమేంటో నాకు అసలు అర్థంకావడం లేదు. మనకి కాకపోతే వేరే దేశాలకు ఈ మ్యాచ్​లను నిర్వహించే అవకాశం దక్కుతోంది. అప్పుడు క్రికెట్‌ విస్తరించేందుకు వీలుగా ఉంటుంది. చాలామంది ఈ టోర్నీని నిర్వహించడం వల్ల బీసీసీఐకి ఆదాయం రాదనే కోణంలో నెట్టింట కామెంట్​ చేస్తున్నారు. అయితే సీనియర్ జట్లు పాల్గొనే వరల్డ్‌ కప్‌ల వల్ల కూడా కొన్నిసార్లు ఆ సంస్థకు ఆదాయం ఉండదు. అలాగని మనం నిర్వహించకుండా ఉంటున్నామా? లేదు కదా. అయితే, భవిష్యత్తులో తప్పకుండా అండర్ -19 ప్రపంచకప్‌ భారత్‌లో జరుగుతుందని నేను భావిస్తున్నాను" అని సౌరభ్ వ్యాఖ్యానించాడు.

ఇక అండర్ 19లో భారత్ ఇప్పటి వరకు ఇప్పటివరకు ఐదుసార్లు గెలిచింది. సీనియర్ ప్లేయర్ మహమ్మద్‌ కైఫ్‌ సారథ్యంలో 2000 ఎడిషన్​లో ఛాంపియన్‌గా అవతరించింది. 2008లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 2012లో ఉన్ముక్త్‌ చంద్, ఇక 2018లో పృథ్వీషా, 2022లో యశ్‌ధుల్ ఇలా ఈ ప్లేయర్లందరూ భారత్‌కు కప్​ను అందించారు. ఇప్పుడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఈ సారి ఫైనల్‌కు చేరుకుంది. ఉదయ్‌ సహరన్‌ నాయకత్వంలో ఈ సారి గెలిస్తే వరుసగా రెండుసార్లు టైటిల్‌ను గెలిచిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. గతంలో పాకిస్థాన్‌ (2004, 2006) ఈ ఘనతను సాధించింది.

అండర్​-19తో క్రికెట్​లోకి ఎంట్రీ- ఒక్క రోహిత్ తప్ప అందరూ రిటైర్​!

భారత్ x ఆస్ట్రేలియా ఫైనల్- తేల్చుకోవాల్సిన లెక్కలెన్నో- ఈసారి దెబ్బ కొట్టాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.