ETV Bharat / sports

తెలుగు స్టార్ షట్లర్​ సాయి ప్రణీత్‌ సాధించిన రికార్డులివే

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 6:46 AM IST

Updated : Mar 5, 2024, 9:43 AM IST

Shuttler Sai Praneeth Retirement : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, హైదరాబాద్‌ ప్లేయర్​ భమిడిపాటి సాయి ప్రణీత్‌ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి సాధించిన రికార్డులు, కెరీర్ ఎలా సాగిందో తెలుసుకుందాం.

తెలుగు స్టార్ షట్లర్​ సాయి ప్రణీత్‌ సాధించిన రికార్డులివే
తెలుగు స్టార్ షట్లర్​ సాయి ప్రణీత్‌ సాధించిన రికార్డులివే

Shuttler Sai Praneeth Retirement : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, హైదరాబాద్‌ ప్లేయర్​ భమిడిపాటి సాయి ప్రణీత్‌ ఆటకు రిటైర్మెంట్ పలికిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్​ బ్యాడ్మింటన్‌కు అతడు వీడ్కోలు పలికాడు. దీంతో చాలా మంది షాక్ అయ్యారు. త్వరలోనే అమెరికాలోని ట్రయాంగిల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రధాన కోచ్‌గా కొత్త ప్రయాణాన్ని మొదలెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి సాధించిన రికార్డులు, కెరీర్ ఎలా సాగిందో తెలుసుకుందాం.

Shuttler Sai Praneeth Records :

  • 2010 ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రణీత్.
  • అయితే ఈ ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ మెడల్​ను సాధించడం కన్నా ముందే అతడు 2008 కామన్వెల్త్‌ యూత్‌ క్రీడల్లో డబుల్స్‌ కాంస్యం కూడా అందుకున్నాడు
  • సీనియర్‌ స్థాయిలోనూ సాయి ప్రణీత్​ తన ప్రతిభతో సత్తాచాటా అందరి దృష్టిని మరింత ఆకట్టుకున్నాడు.
  • 2017 సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్​ను దక్కించుకుని తన టాలెంట్​ ఏంటో నిరూపించుకున్నాడు.
  • సైనా నెహ్వాల్​, పీవీ సింధు, శ్రీకాంత్​లు కూడా ఈ సిరీస్​లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. వీరి తర్వాత ఈ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో విజయం సాధించిన నాలుగో భారత షట్లర్‌గా నిలిచాడు.
  • అయితే 2019 స్విస్‌ ఓపెన్‌ ఫైనల్​లో మనోడికి నిరాశ ఎదురైంది. ఓటమి చెందాడు.
  • కానీ అదే ఏడాది 2019 వరల్డ్​ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టాడు ప్రణీత్​. కాంస్యంతో 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు. ప్రకాశ్‌ పదుకొనె (1983) తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పురుషుల సింగిల్స్‌లో భారత్​కు కాంస్యం దక్కింది ప్రణీతే వల్లే.
  • ఆ తర్వాత శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, ప్రణయ్‌ కూడా ఈ మెడల్స్​ను ముద్దాడారు.
  • ఇక 2019లోనే అర్జున పురస్కారాన్ని ముద్దాడాడు ప్రణీత్‌. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.
  • ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ తన బెస్ట్ పెర్ఫామెన్స్​ వల్ల పదో స్థానంలో నిలిచాడు. మెన్స్ టీమ్ తరపున ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలను దక్కించుకుని మరోసారి సత్తా చాటాడు.
  • అయితే కరోనా విరామం అతడికి ప్రతికూలంగా మారింది. ఆ తర్వాత అతడు తిరిగి పుంజుకోలేకపోయాడు. గాయాల కారణంగా కూడా బాగానే వెనకబడ్డాడు. టాప్‌-100 లోపు ర్యాంకు కోల్పోవాల్సి వచ్చింది. చివరగా నిరుడు గువాహటి మాస్టర్స్‌ టోర్నీ బరిలో దిగి అతడు ఆడాడు.

బాధ లేదు సంతోషమే - రిటైర్మెంట్​పై సాయి ప్రణీత్

పోరాటంలో మానసిక ఒత్తిడి ఎక్కువైంది - రెజ్లింగ్​కు తిరిగి రాలేను : సాక్షి మాలిక్​

Last Updated : Mar 5, 2024, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.