ETV Bharat / sports

శ్రేయస్ అయ్యర్​కు ఎదురుదెబ్బ!​ - ఆ మ్యాచ్​కు దూరమేనా?

రంజీ ట్రోఫీలో ఆడుతున్న శ్రేయస్​ అయ్యర్​కు ఎదురుదెబ్బ!

Ranji Trophy  Shreyas Iyer Injured
Ranji Trophy  Shreyas Iyer Injured (source IANS)
author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

Ranji Trophy Shreyas Iyer Injured : టీమ్​ ఇండియాలోకి కమ్​ బ్యాక్​ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్న శ్రేయస్​ అయ్యర్​కు ఎదురు దెబ్బ తగిలింది! రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరగబోయే మ్యాచ్​కు అతడు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్​ (ఎమ్​సీఏ)లోని ఓ పెద్ద అధికారి ఈటీవీ భారత్​తో తెలిపారు. అయితే శ్రేయస్ ఈ మధ్య వరుస మ్యాచులు ఆడటం వల్ల రెస్ట్ తీసుకునేందుకు త్రిపురతో మ్యాచ్​కు దూరమవుతున్నాడని కొంత మంది అంటున్నారు.

గాయపడ్డాడా? - ఇదే సమయంలో అయ్యర్ మరోసారి గాయపడ్డాడని ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి. శ్రేయస్‌ భుజానికి దెబ్బ తగిలిందట. దీంతో అతడు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో అతను ముంబయి నెక్ట్స్​ ఆడబోయే రంజీ మ్యాచ్‌కు దూరం కానున్నాడని చెబుతున్నారు. రంజీల్లో రాణించి భారత జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్న శ్రేయస్‌కు గాయాలు పెద్ద సమస్యగా మారాయని అంటున్నారు.

కాగా, ముంబయి ఈ నెల 26న త్రిపురతో పోటీ పడనుంది. ఈ రంజీ ట్రోఫీలో బరోడాపై ఓటమితో మొదలు పెట్టిన ముంబయి, గత రంజీ మ్యాచ్​ను మహారాష్ట్రపై ఆడింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ముంబయి 9 వికెట్లతో విజయం సాధించి గట్టి కమ్​ బ్యాక్ ఇచ్చింది. ఈ పోరులో అయ్యర్​ 142 పరుగులు విన్నింగ్​ సెంచరీతో మెరిశాడు. ఈ రంజీ సీజన్‌లో ఇప్పటివరకు అతడు మూడు ఇన్నింగ్స్‌లు ఆడి 57.33 సగటున 172 పరుగులు సాధించాడు. బరోడాతో జరిగిన సీజన్‌ తొలి మ్యాచ్‌లో 0, 30 పరుగులు చేశాడు.

ఇకపోతే శ్రేయస్‌ ఈ ఏడాది ఆగస్ట్‌లో చివరి సారిగా టీమ్ ఇండియా తరఫున ఆడాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. అప్పటి నుంచి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఈ మధ్య కాలంలో దులీప్‌ ట్రోఫీ, ఇరానీ కప్‌, రంజీ ట్రోఫీలో మొత్తం ఆరు మ్యాచ్‌ల వరకు ఆడాడు. చూడాలి మరి టీమ్ ఇండియా నెక్ట్స్ ​ ఆడబోయే బోర్డర్ గావస్కర్​ ట్రోఫీలో చోటు దక్కించుకుంటాడో లేదో.

ఆటోగ్రాఫ్ అడిగి, కోహ్లీ గురించి ఆరా తీసిన లేడీ ఫ్యాన్​ - కూల్ రిప్లైతో మనసు గెలిచిన రోహిత్

జహీర్‌ ఖాన్ రిపోర్ట్‌ - కేఎల్‌ రాహుల్‌ను రిలీజ్ చేయడం పక్కానే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.