Shivam Mavi Lucknow Super Giants : వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ టీమ్ స్టార్ పేసర్ శివమ్ మావీ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ లఖ్‌నవూ ఫ్రాంచైజీ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో శిమమ్ మాట్లాడిన క్లిప్ ఉంది.
"ఐపీఎల్‌ను నేను ఎంతో మిస్ అవుతున్నాను. గాయం నుంచి కోలుకుని వచ్చాను. అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో జట్టు విజయాల్లో నేనూ ఓ భాగం కావాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నా గాయం తిరగబెట్టింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ లీగ్‌కు దూరం అవ్వాల్సి వచ్చింది. మాకు ఓ అద్భుతమైన జట్టు ఉంది. మేం ఖచ్చితంగా గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. నేను ఎక్కడ ఉన్నా కూడా జట్టును ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను." అంటూ ఎమోషనలయ్యాడు. అయితే ఐపీఎల్ మినీ వేలంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు శివమ్ మావీని రూ. 6.4 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. అయితే, ఈ సీజన్‌లో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
-
You'll come back stronger, Shivam. And we're with you all the way. 💙 pic.twitter.com/zYSs3URV1p
— Lucknow Super Giants (@LucknowIPL) April 3, 2024
మరోవైపు ఇప్పటికే ఈ జట్టు నుంచి ఇద్దరు ప్లేయర్స్ దూరమయ్యారు. పనిభారం కారణంగా మార్క్‌వుడ్ తప్పుకోగా, డేవిడ్ విల్లీ కూడా అందుబాటులో ఉండట్లేదంటూ తెలిపాడు. దీంతో మార్క్ వుడ్ ప్లేస్‌లో వెస్టిండీస్ యంగ్ స్టార్ షామర్ జోసెఫ్, విల్లీ స్థానంలోకి న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ రానున్నారు. ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం లఖ్‌నవూ జట్టు నాలుగో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పుడు తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 7న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. లఖ్‌నవూలోని ఎకానా స్పోర్ట్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
లఖ్‌నవూ తుది జట్టు (అంచనా) : కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, యశ్ ఠాకూర్, నవీనుల్ హక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, అమిత్ ఠాకూర్, షామర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్, కే.గౌతమ్, అర్షిన్ కులకర్ణి, సిద్ధార్థ్, అస్టన్ టర్నర్, అర్షద్ ఖాన్, మ్యాట్ హెన్రీ.
మా ఓటమికి కారణాలు అవే- మయంక్ ఓ అద్భుతం!: డూప్లెసిస్ - Faf Du Plessis IPL 2024
నయా స్పీడ్ గన్‌కు షూ స్పాన్సర్లు లేరట!- మయంక్ టార్గెట్ అదే - Mayank Yadav IPL 2024