ETV Bharat / sports

శివమ్, అంజూల జర్నీ - ఓ హిందూ ముస్లిం ప్రేమ కథ - Shivam Dube Love Story

Shivam Dube Love Story : ఉప్పల్​ వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. కానీ ఆ జట్టులోని శివమ్​ దూబె మాత్రం తన ఇన్నింగ్స్​లో అలుపెరుగని పోరాటం చేసి మంచి స్కోర్ అందించాడు. అయితే అతడు ఇలా కష్టపడటం ఇదేం తొలి సారి కాదు. ఏడాది ప్రేమను గెలిపించుకునేందుకు కూడా తాను ఎంతో చేశాడు. అలా రెండు మతాలను ఒక్కటి చేశాడు. ఇంతకీ ఈ స్టార్ హీరో లవ్ స్టోరీ మీకు తెలుసా ?

Shivam Dube Love Story
Shivam Dube Love Story
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 12:33 PM IST

Updated : Apr 6, 2024, 1:05 PM IST

Shivam Dube Love Story : హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు మొత్తం చేతులెత్తేసినప్పటికీ తానొక్కడై నిలబడ్డాడు. కీలక స్కోర్ అందించి చెన్నై సూపర్ కింగ్స్ కోసం పరువు నిలబెట్టుకునేంత స్కోరు నమోదు చేసి చూపాడు. జట్టు ఓడినప్పటికీ ఈ స్టార్ ఇన్నింగ్స్​కు చెన్నై అభిమానులు మర్చిపోలేరు. అతడే యంగ్​ ప్లేయర్ శివమ్ దూబె.

క్రీజులో వచ్చినప్పటి నుంచి అలుపెరగకుండా పోరాడి 45 పరుగులు స్కోర్ చేశాడు. జట్టు పని ఇక అంతే అన్న తరుణంలో 45 పరుగులు చేసి సత్తా చాటాడు. అయితే ఈ యంగ్ బ్యాటర్​కు ఇటువంటి ఒత్తిడులు తట్టుకోవడం కొత్తేం కాదు. అతడి పెళ్లి విషయంలోనూ అదే జరిగింది. దాదాపు ఏడాది ప్రేమాయణం తర్వాత శివమ్​ ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

అంజుమ్ ఖాన్ అనే ముస్లిం యువతిని శివమ్​ ప్రేమించాడు. ఆమె ఓ మోడల్​, నటి కూడా. దాదాపు ఏడాది పాటు వీళ్ల లవ్ జర్నీ సాగింది. అయితే వీళ్ల పెళ్లి గురించి ప్రస్తావన వచ్చే సరికి తాము ఒప్పుకునేది లేదంటూ చెప్పారట దూబె తల్లిదండ్రులు. అయితే వాళ్ల చేత ఓకే చెప్పించేందుకు నానాతంటాలు పడ్డాడట శివమ్. ఆఖరికి ఈ జంట 2021 జులైలో హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు.

ఇంతటితో హ్యాపీ ఎండింగ్ అని అందరూ అనుకుంటున్న తరుణంలో అసలు కథ మొదలైంది. వీరి పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు. ఇక అంతే ఇరు మతాలకు సంబంధించిన వాళ్లు, పెద్దలు అందరూ వీళ్లకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలెట్టారు. పరస్పర వాగ్వాదాలతో, ట్రోలింగులకు దిగారు. అటువంటి క్లిష్ట సమయంలో ఈ జంటకు వారి పేరెంట్స్ నుంచి అందిన మద్దతు వల్ల ఆ కష్టం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత నుంచి ఈ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరికి అయాన్ అనే తనయుడు జన్మించాడు.

ఐపీఎల్ 2022లో జరిగిన వేలంలో శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నై జట్టులోకి రాకముందు అతడ్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 5.8 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడ శివమ్ దూబెకు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించకపోవడం వల్ల రాజస్థాన్ రాయల్స్‌లో తన ట్యాలెంట్​ను చూపించుకునే అవకాశం రాకుండాపోయింది. ఆ తర్వాత రిటెన్షన్ జాబితాలో ఉంచుకోకుండా వేలానికి వదిలేయడం వల్ల చెన్నైకు సొంతమయ్యాడు.

చెన్నై ఓడినా శివమ్ దూబె ధమాకా ఇన్నింగ్స్​ - సిక్సర్ల మోత! - IPL 2024 Sunrisers VS CSK

'ముంబయి కాకపోతే కోల్​కతా కెప్టెన్ అవుతా'!- రోహిత్ షాకింగ్ డెసిషన్- వీడియో వైరల్ - Rohit Sharma KKR IPL

Last Updated : Apr 6, 2024, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.