Shah Rukh Khan- Kavya Maran Net Worth: సమ్మరీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ అనగానే కావ్యా మారన్, కోల్‌కతా పేరు వినగానే షారుఖ్ గుర్తు వస్తారు. రానున్న ఐపీఎల్‌కి ఇద్దరూ తమ టీమ్‌లను దాదాపుగా కొనసాగించే యోచనలో ఉన్నారు. ఇంతకీ వీరిద్దరిలో ఎవరు రిచ్ తెలుసా?
ఐపీఎల్ 2024 సీజన్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రన్నర్‌గా నిలిచాయి. ఈ రెండు ఫ్రాంచైజీలకు బలమైన జట్లు లభించాయి. దీంతో ఈ టీమ్‌లనే దాదాపు కొనసాగించాలని భావిస్తున్నాయి. ఇటీవల ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ సెక్రెటరీ జై షా నేతృత్వంలో జులై 31న జరిగిన సమావేశంలో ఇదే అభిప్రాయం తెలియజేశాయి.
సన్‌రైజర్స్ సహ యజమాని కావ్య మారన్, కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ ఎక్కువ మంది ప్లేయర్లను ఉంచుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. కావ్య, షారుఖ్ టీమ్‌ని కంటిన్యూ చేయాలని పట్టుబట్టడం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది వీరిద్దరిలో ఎవరు అత్యధిక ధనవంతులు? అని కూడా సెర్చ్ చేస్తున్నారు.
RTM కార్డ్ ఆప్షన్లు
గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనపై కావ్య మారన్ సంతృప్తి చెందింది. 2025 సీజన్‌లో కోర్ యూనిట్‌ను కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవల సమావేశంలో ఆమె ఇదే వాదన వినిపించారు. కనీసం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి లేదా రైట్ టు మ్యాచ్ (RTM) కార్డులను వేలంలో ఉపయోగించడానికి జట్లను అనుమతించాలని కోరారు. నాలుగు రిటెన్షన్లు, రెండు రైట్ టూ మ్యాచ్ ఆప్షన్లను ఆమె సూచించింది. కేవలం రిటెన్షన్లు మాత్రమే అనుమతిస్తే, ఫ్రాంచైజీలు సైడ్ కాంట్రాక్ట్‌లను ఆశ్రయించవచ్చని, RTM కార్డ్‌లు ఫైనాన్షియల్ !ట్రాన్స్‌పెరెన్సీని ప్రోత్సహిస్తాయని మారన్ హైలైట్ చేశారు.
షారుక్ ఖాన్ ఆగ్రహం!
!కేకేఆర్, హైదరాబాద్ 7- 8 మంది ఆటగాళ్లను ఉంచాలని కోరుకున్నాయని అయితే పంజాబ్సహా ఇతర ఫ్రాంచైజీలు తక్కువ రిటెన్షన్లు ఉండాలని తెలిపాయని సమాచారం. దీంతో సమావేశంలో పంజాబ్ కింగ్స్ సహ- యజమాని నెస్ వాడియా, షారుక్ ఖాన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
కావ్య మారన్ నేపథ్యం
కావ్య మారన్ తన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్‌కి హాజరవుతూ, ప్లేయర్స్‌ని ప్రోత్సహిస్తూ కనిపిస్తుంటారు. గత ఐపీఎల్‌లో ఆమె రియాక్షన్స్ వైరల్‌గా మారాయి. కావ్య పాఠశాల విద్యను చెన్నైలో పూర్తి చేసి లండన్‌లో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ సన్ గ్రూప్, SRH, ఇతర వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఆమె తండ్రి, కళానిధి మారన్, సన్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో అనేక టీవీ ఛానెల్, వార్తాపత్రికలు, రేడియో స్టేషన్, ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, వారపత్రిక ఉన్నాయి. ఈ కుటుంబం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ సర్వీస్‌ను కూడా కలిగి ఉంది.
బాలీవుడ్ కింగ్ ఖాన్‌గత సీజన్‌లో కేకేఆర్ ఐపీఎల్ తెలవడంలో షారుక్ ఖాన్ పాత్ర కూడా ఉంది. జట్టు అవసరాలు తీర్చడంలోనే కాదు, దాదాపు ప్రతి మ్యాచ్‌కి హాజరై జట్టును ప్రోత్సహించారు. ఈ బాలీవుడ్ కింగ్ ఖాన్ జట్టును, ఫ్యాన్ బేస్‌ను బిల్డ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
షారక్ - కావ్య మారన్ ఎవరు రిచ్?
షారుక్ ఖాన్‌కి పాపులారిటీ, సక్సెస్ ఉన్నప్పటికీ కావ్య మారన్ చాలా ధనవంతురాలు. ఇందుకు ఆమె తండ్రి కళానిధి మారన్‌కు చెందిన విస్తారమైన వ్యాపార సామ్రాజ్యం కారణమని చెప్పవచ్చు. భారతదేశ బిలియనీర్ల జాబితాలో 82వ స్థానంలో ఉన్న కళానిధి మారన్ నికర విలువ రూ.24,000 కోట్లు. ఆయనకు కావ్య ఏకైక సంతానం కావడం వల్ల ఈ ఆస్తులకు ఆమెనే వారసురాలు. మరో వైపు షారుక్ నెట్ వర్త్ దాదాపు రూ.6000 కోట్లు. షారుక్ ప్రధాన ఆదాయ వనరు సినిమాలు మాత్రమే. VFX స్టూడియో, అనేక ఇతర వ్యాపార సంస్థలలో పెట్టుబడులతో కూడా లాభాలు అందుకుంటున్నారు.